ప్రశాంత వాతావరణంలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు.
పోలవరం, మార్చి 1 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పోలవరం మండలంలో పోలవరం జూనియర్ కళాశాల నందు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు మొదటిరోజు ప్రశాంత వాతావరణంలో జరిగాయని. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు 40 మంది పరీక్ష రాయవలసి ఉండగా అందులో 24 మంది విద్యార్థినిలు, 12 మంది విద్యార్థులు మొత్తం 36 మంది విద్యార్థులు మొదటిరోజు పరీక్షకు హాజరైనట్లు , 4 విద్యార్థులు హాజరు కానట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలియజేశారు.