గండిపడి. 12 రోజులైనా పూర్త లేకపోయినా ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Sep 17, 2024 - 13:23
Sep 17, 2024 - 20:36
 0  21
గండిపడి.  12  రోజులైనా పూర్త లేకపోయినా ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

గండిని పూడ్చడంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విఫలం

మునక 500 ఎకరాలు అయితే ఎండుతున్న పంట 50వేల ఎకరాలు

గండిపడి 12 రోజులైనా పూడ్చలేకపోయిన ప్రభుత్వం

టెండర్ల పేరుతో కమిషన్ల కోసం కాలయాపన చేస్తూ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

పరిశీలనలతోనే సరిపుచ్చుకోవడం కాదు.. దగ్గరుండి పనులు పూర్తి చేయించండి

పంటలు ఎండి బోర్ మంటున్న సాగర్ ఎడమ కాలువ ఆయ కట్టు రైతాంగం... మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు

కోదాడ నియోజకవర్గంలో ఎండిపోయిన పొలాలను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు

నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని పూడ్చడంలో తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పూర్తిగా విఫలం చెందారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఘాటుగా విమర్శించారు. మంగళవారం కోదాడ మండలంలో గణపవరం, ఎర్రవరం, రామ లక్ష్మి పురం, బిక్య తండా , తొగర్రాయి గ్రామాలలో ఎడమ కాలువ ఆయ కట్టు కింద ఎండిపోతున్న వరి పొలాలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. గండి పడడం ద్వారా మునిగింది 500 ఎకరాల పొలం అయితే గండి పూడ్చడంలో విఫలం చెందడం వల్ల 50 వేల ఎకరాల వరి పొలాలు ఎండిపోతున్నాయన్నారు. గండిపడి 12 రోజులు దాటిన నేటి వరకు పనులు పూర్తి కాకపోవడం ప్రభుత్వానికి రైతాంగం పై ఉన్న నిర్లక్ష్యం అని ధ్వజమెత్తారు వారం రోజుల్లో గండి పూడిపిస్తానని ఇచ్చిన హామీని మంత్రి ఉత్తం నిలబెట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. వేల రూపాయలు అప్పులు చేసి గత మూడు నెలలుగా శ్రమించి వరి పంట సాగు చేసిన రైతాంగానికి కడగండ్లు మిగిలిచ్చారని విమర్శించారు. రెండుసార్లు పర్యటించానని ప్రకటించుకోవడం కాదని గండి ని దగ్గరుండి పూడిపించాలని డిమాండ్ చేశారు. టెండర్ల పేరుతో కమిషన్ల కోసం కాలయాపన చేస్తూ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్న పాలకులపై రైతాంగం పెద్ద ఎత్తున ‌ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.రైతులకు బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుందని యుద్ధ ప్రాతిపదికన గండి పూర్తించకపోతే రైతంగంతో కలిసి పెద్ద ఎత్తునఆందోళన చేస్తామన్నారు. నీళ్లు లేక ఎండిపోతున్న పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడమ ఆయకట్టు రైతులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State