1లక్ష 20 వేలు పలికిన వేదాంత భజన మందిరం లడ్డు

లడ్డూను దక్కించుకున్న కొత్తూరి సందీప్

Sep 17, 2024 - 09:49
Sep 17, 2024 - 09:50
 0  10
1లక్ష 20 వేలు పలికిన వేదాంత భజన మందిరం లడ్డు

తెలంగాణ వార్త/సూర్యాపేట జిల్లా ప్రతినిధి  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్ శ్రీ వేదాంత భజన మందిరం వద్ద ఏర్పాటుచేసిన విగ్నేశ్వరుని లడ్డూను భానుపురి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లడ్డూ వేలంపాట కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రం బొడ్రాయి బజార్ కు చెందిన కొత్తూరు సందీప్ లక్ష ఇరవై వేల రూపాయలకు లడ్డును సోమవారం వేలం పాటలో దక్కించుకున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటక0డ్ల జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చేతుల మీదుగా లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా, ఘనంగా నిర్వహించుకోవడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వేదాంత భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి నకిరేకంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్ మందిర అర్చకులు ధరూరి సింగరాచార్యులు ధరూరి రాఘవాచార్యులు భానుపురి ఉత్సవ సమితి అధ్యక్షుడు రంగరాజు రుక్మారావు, వివిధ పార్టీల నాయకులు, కౌన్సిలర్లు భానుపురి ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333