ఏటిలో పడిన మహిళ శవం ఆచూకీ లభ్యం

Aug 7, 2025 - 21:02
 0  7
ఏటిలో పడిన మహిళ శవం ఆచూకీ లభ్యం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్   బంధువుల దశదినకర్మకు వెళ్లి ఏటిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఏపూర్ గ్రామ శివారు గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన పచ్చిపాల నాగమ్మ 45. ఈనెల 4న మోతె మండలం సర్వారం గ్రామంలో బంధువుల దశదినకర్మకు వెళ్లి తిరిగి వచ్చే క్రమం లో మండల పరిధిలోని ఏపూర్ గ్రామ శివారులో గల పాలేరు ఏటిలో కాలకృత్యాల కొరకు వాగు లోకి వెళ్ళి ప్రమాద వశాత్తు వాగు లో పడి చని పోయినట్లు తెలిపారు. గురువారం స్థానికులు చూసి పోలీసులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలు కొడుకు పచ్చిపాల రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యస్.ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.