జర్నలిస్టులే..నాలుగోవ స్తంభం కల్వకుంట్ల కవిత

Nov 10, 2025 - 22:01
Nov 10, 2025 - 22:15
 0  5

వరంగల్ 10 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ ఓరుగల్లు సభ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఓరుగల్లు లో సభ విజయవంతమైనది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేసేవారుగా ఉండే జర్నలిస్టులు 4వ స్తంభం అని అన్నారు. జర్నలిస్టులకు అన్ని రకాల సహాయ సహకారాలు తనవంతుగా ఉంటాయని సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని ఆమె అన్నారు.అలాగే జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డెమొక్రటిక్ జనరేషన్ వర్కింగ్ జర్నలిస్టులందరికి 10 లక్షల ఇన్సూరెన్స్ అన్ని జిల్లాల సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని అలాగే ప్రతి జర్నలిస్టు ప్రతిరోజు వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని అప్పుడే గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు.రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని అలాగే జిల్లా ఇన్చార్జిలుగా కేటాయించిన రాష్ట్ర నాయకులు ఆయా జిల్లాల కమిటీలను త్వరగా నియమించాలని అన్నారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురపాక రాజు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబడినటువంటి మల్లయ్య మహర్షి వివిధ జిల్లాల రాష్ట్ర జిల్లా నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.