ఇటీవలే మతమార్పిళ్లను నిరోదించాలన్న పిటిషన్ కొట్టివేసిన సుప్రీమ్ కోర్టు తీర్పుపై హార్షం

బిషప్ దుర్గం ప్రభాకర్
తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు
25 వ అధికరణ ప్రకారం ప్రతిిిి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు
మత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు
రాజ్యాంగం పై ప్రతి వ్యక్తి అవగాహనా కలిగి ఉండాలి
మంగళవారం 13 మే : శాంతినగర్, సూర్యాపేట బేతెస్థ మినిస్ట్రీస్ క్యాంపస్ నందు తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవలే ఏప్రిల్ 8 న న్యూడిల్లీ భారదేశంలో 18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు నని సుప్రీమ్ కోర్టుపేర్కొందని, మతమార్పిళ్లను నిరోదించాలన్న పిటిషన్ కొట్టివేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు తీర్పు ఇవ్వడమం పై హార్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు, రాజ్యాంగం తోనే దేశం అభివృద్ధి చెంద్డుదని, భారతదేశంలో పౌరులందరికీ మతస్వాతంత్ర్యపు హక్కును, అధికరణలు (ఆర్టికల్స్) 25, 26, 27, 28 ల ప్రకారం ఇవ్వబడిందనీ. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం సెక్యులరిజం సూత్రాలను స్థాపించుటకు ఉద్ద్యేశించినవి.భారత రాజ్యాంగం ప్రకారం , భారతదేశంలోని అన్ని మతాలు సమానమే, ఏ మతమూ ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదనీ. ప్రతి పౌరుడు తన ఇష్టానుసారం మతాన్ని అవలంబించుటకు స్వేచ్ఛ కల్పింపబడ్డాడు అనీ, పౌరులు తమ మతాలగూర్చి ఉపన్యసించవచ్చు, అవలంబించవచ్చు, మతవ్యాప్తికొరకు పాటుపడవచ్చుననీ 25 వ అధికరణ ప్రకారం ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అనీ సుప్రీమ్ కోర్టు తీర్పు తేల్చి మరొకసారి చెప్పిందని అన్నారు.ఈ కార్యక్రమం లో సువార్త చర్చి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కో ఆర్డినేటర్ పాస్టర్ సి. హెచ్. శ్యాం ప్రసాద్, బిషప్ డా ముల్లంగి జాకబ్ రాజు, సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్, పెన్ పహాడ్ అధ్యక్షులు రెవ. డా. డి. జాన్ ప్రకాష్, సూర్యాపేట రూరల్ అధ్యక్షులు పాస్టర్ యల్క ప్రభాకర్, గౌరవ సలహాదారులు రెవ. బొక్క ఏలీయా రాజు, పాస్టర్ రాజు ఉటుకూరి, రెవ డా పంది మార్క్,రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాస్టర్ రెవ ఏర్పుల క్రిస్టోఫర్, పాస్టర్ కె. లాజర్, యం. రూబెన్, పి. వి. బోయాజ్, డికెన్ ఫాదర్ శ్యాగ యాకోబు, ప్రేమ్ సాగర్, కొమ్ము హోసన్నా, బాణాల సైమన్ తదితరులు పాల్గొన్నారు