ఎంపీడీవో కార్యాలయంలో సామాగ్రి గల్లంతు

Jan 12, 2026 - 12:31
Jan 12, 2026 - 12:40
 0  69
ఎంపీడీవో కార్యాలయంలో సామాగ్రి గల్లంతు

  మోత్కూర్ 12 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ఇది ఇంటి దొంగల పనేనా ...? లేకపోతే బయటివారా..! 

టీవీ డిష్ యాంటిన రకరకాల వస్తువులు మాయం.. ! 

ప్రజాధనం వృద పట్టించుకోని అధికారులు.. ! 

మోత్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో గతంలో మన టీవీ కార్యక్రమాలు వీక్షించేందుకు ఏర్పాటు చేసిన 29 ఇంచెస్ ఫిలిప్స్ సిఆర్టి టీవీ ప్రస్తుతం కనిపించడం లేదు, గత కొంతకాలంగా కాళీ బాక్స్ దర్శనమిస్తుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన సామాగ్రి ఒక్కొక్కటిగా కనుమరుగవుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ, నిఘా లోపించడంతో ప్రభుత్వ ఆస్తులు కార్యాలయాల నుంచి అధికారుల వ్యక్తిగత వినియోగానికి తరలిపోతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో  సర్పంచ్‌లకు నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు, ఫోన్ ఇన్ కార్యక్రమాల కోసం ప్రతి మండల పరిషత్ కార్యాలయానికి  ‘మన టీవీ’ ప్రసారాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా మోత్కూర్ ఎంపీడీవో కార్యాలయానికి 29 ఇంచుల ఫిలిప్స్ సిఆర్టి టీవీతో పాటు డిష్ యాంటెనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. టీవీలను  భద్రపరిచేందుకు ప్రత్యేకంగా కార్డుబోర్డు బాక్సులను కూడా అందజేశారు. కొంతకాలం పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు వీటి ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను వీక్షించేవారు.సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో పాత సిఆర్టి టీవీల స్థానంలో ప్రభుత్వం పానాసోనిక్ 49 ఇంచుల ఎల్ఈడీ టీవీలను సరఫరా చేసింది. దీంతో పాత ఫిలిప్స్ టీవీలు మూలనపడ్డాయి. అయితే, వీటి సంరక్షణపై అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ప్రస్తుతం అవి కార్యాలయంలో కనిపించడం లేదు. కేవలం వాటిని భద్రపరిచే ఖాళీ బాక్సులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో డిష్ యాంటెనా, పాత టీవీల వినియోగం తగ్గిపోయింది. ఇదే అదనుగా భావించిన కొందరు సిబ్బంది లేదా అధికారులు ఆ టీవీలను తమ ఇళ్లకు తరలించారనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు ప్రజాధనంతో కూడుకున్నవి కాబట్టి, ఆ టీవీలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో స్పష్టం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రభుత్వ సామాగ్రి గల్లంతుపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఇదే విషయమై ఎంపీడీవో బాలాజీ నీ వివరణ కోరగా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ బయటపడిసిన ఎవరు తీసుకెళ్లని ఆ పాత టీవీ ల గురించి ఇప్పుడు మీరు అడగడం  అవసరమా అని, దాని గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. చార్జి తీసుకున్న రోజు నుండి అది కార్యాలయంలో కనిపించడం లేదని తెలిపారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి