సర్కిల్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన సర్పంచులు
చౌటపల్లి, సూర్యపేట జిల్లా : - నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా వేణు మెమోరియల్ చౌటపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న... సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చౌటపల్లి సర్పంచ్ బేత ప్రతాపరెడ్డి, బక్కమంతుల గూడెం సర్పంచ్ ఇరిగెల నరేందర్ రెడ్డి గార్లు
- ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడమే కాక, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, పండగలపూట ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషదాయకమని అన్నారు.
???? ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు, వార్డు మెంబర్లు, పలు పార్టీల నాయకులు, క్రీడాకారులు, పిల్లలు పాల్గొన్నారు.