గుండ గాని వీరస్వామి గౌడ్ మరణం *బాధాకరం
సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్
(సూర్యాపేట టౌన్ ,డిసెంబర్ 4) : రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సభ్యులు గుండ గాని వీరస్వామి గౌడ్ అకాల మరణం బాధాకరమని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ జలగం సత్యం గౌడ్ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణానికి చెందిన గుండ గాని వీరస్వామి గౌడ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంతంగి వీరస్వామి గౌడ్ ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ లో గుండ గాని వీరస్వామి గౌడ్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా కోశాధికారి పాల సైదులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ బుర్ర సరస్వతి పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి రియల్ ఎస్టేట్ జిల్లా కార్యదర్శి మందాడి గోవర్ధన్ గౌడ్ సోమ గాని వేణు గౌడ్ అయితే గాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ గుణగంటి శ్యామ్ గౌడ్ శేఖర్ చింత వెంకన్న పాష ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్ తదితరులున్నారు.