ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ* చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి... ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని గట్టికల్ గ్రామంలోఇందిరమ్మ ఇంటి నిర్మాణపనులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి బుధవారం భూమిపూజ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు. త్వరగా ఇండ్లను నిర్మాణం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి,మండల పార్టీ నాయకులు కందాల రామిరెడ్డి, కోన అయోధ్య, కోన రాజా, నారగాని లింగయ్య, శ్రీకాంత్, దానియేలు, లింగయ్య,తదితరులు పాల్గొన్నారు.