మడేలయ జయంతి సందర్భంగా రజక సంఘం 58వేల రూ"ఆర్థిక సహాయం

Feb 2, 2026 - 08:03
Feb 2, 2026 - 08:04
 0  5
మడేలయ జయంతి సందర్భంగా రజక సంఘం 58వేల రూ"ఆర్థిక సహాయం

అడ్డగూడూరు 01 ఫిబ్రవరి తెలంగాణవార్త రిపోర్టర్:–   

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన బాసాని యాదగిరి గత రెండు సంవత్సరాల నుంచి పక్ష వాతంతో అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అదే గ్రామానికి చెందిన రజక సంఘం అధ్యక్షులు అక్కెనపెల్లి నర్సయ్య ఆ సంఘం సభ్యుల సహకారంతో రజక కులదైవమైన మడేలయ జయంతి సందర్భంగా ఆదివారం రోజు 58వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా బాసాని యాదగిరి మాట్లాడుతూ..నేను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను తెలుసుకొని నాకు 58వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుకు సంఘం సభ్యులకు పేరుపేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కంబాల వీరయ్య,వల్లంబట్ల రవీందర్రావు,కేసరపు ఆంజనేయులు,పనుమటి అంజయ్య,బండి వెంకన్న, బొమ్మగాని లక్ష్మయ్య,రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.