బోగస్ పేరుతో అర్హుల పెన్షన్స్ తొలగిస్తే ఉద్యమం చేస్తాం ఎన్.పి.ఆర్.డి సంఘం హెచ్చరిక
భువనగిరి 28 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్.పి ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ బోగస్ పెన్షన్స్ తొలగించాలనే పేరుతో అర్హుల పెన్షన్స్ తొలగించాలని చూస్తే ఉద్యమం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ హేచ్చరిస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం అమలు పంపిణి చేస్తున్న చేయూత పెన్షన్స్ లలో బోగస్ పెన్షన్స్ తొలగించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.కానీ అర్హుత కలిగిన వారి పెన్షన్స్ తొలగించే ప్రమాదం ఉంది.గ్రామాలు,పట్టణాల్లో విస్తృతంగా ప్రభుత్వం ప్రచారం చేసిన తరువాతానే పేస్ రికగ్నేషన్ కార్యక్రమన్ని చేపట్టాలి.లబ్ధి దారులందరు పేస్ రికగ్నేనేషన్ చేస్తే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం చేయడం వలన గ్రామీణ ప్రాంతంలో ఇంటర్నెట్ సౌకర్యం సరిగాలేనప్పుఫు పేస్ రికాగ్నేషన్ ఆచరణలో సాధ్యం కాదు.ఉపాధి కోసం పట్టణాలకు వలసలు వచ్చిన వారు గ్రామంలో లేకుంటే పెన్షన్ తొలగించే ప్రమాదం ఉంది.రాష్ట్రంలో ప్రస్తుతం 42.67 లక్షల మందికి పెన్షన్స్ వస్తున్నవి.పెన్షన్ కోసం ప్రతి నెల సుమారు1000 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది.పోస్టల్ ద్వారా 22.72 లక్షల మంది, బ్యాంక్ల ద్వారా 19.95 లక్షల మంది పెన్షన్స్ పండుతున్నారు.ఇప్పటికే బ్యాంకు ల ద్వారా పెన్షన్ 3నెలల పాటు అమౌంట్ డ్రా చేయనటువంటి వాళ్ళ పెన్షన్స్ రద్దు చేస్తున్న ఘటనలు ఉన్నవి.పేస్ రికాగ్నెషన్ నుండి అనారోగ్యం,వలసలు వెళ్లిన వాళ్లకు మినహాహీంపు ఇవ్వాలి లేదా ప్రత్యేమ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపెల్లి స్వామి,జిల్లా కోశాధికారి కొత్త లలిత,టి వరమ్మ గౌరవ అధ్యక్షులు కె వెంకట్,రాష్ట్ర అధ్యక్షులు యం అడివయ్య,ప్రధాన కార్యదర్శి
ఆర్ వెంకటేష్ కోశాధికారి తదితరుని కార్యక్రమం పాల్గొన్నారు.