వెల్దేవి గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది లేక అవస్థలు పడుతున్న గ్రామ ప్రజలు

అడ్డగూడూరు 25 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.గ్రామంలోని రోడ్లపై చెత్తా చెదారం లేకుండా చూసుకోవాల్సిన సిబ్బంది కరువయ్యారని గ్రామస్తులు వాపోతున్నారు. అసలే బతుకమ్మ దసరా పండుగ సంబరాల సమయంలో గ్రామాన్ని విడిచి బ్రతుకుతెరువు కొరకు వెళ్లిన ప్రజలు తిరిగి తమ సొంత గ్రామాలకు చేరే సమూహం..గ్రామాల పరిస్థితి చూసి ఇదేం గ్రామంరా నాయనా అనే పరిస్థితి నెలకొంది. గ్రామ సిబ్బందిపై బాధ్యతలు తీసుకోవాల్సిన సెక్రటరీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. బజార్లలో నీరు నిలిచి దోమలు,ఈగలు,క్రిమి కీటకాలు చేరి చాలా రోజుల నుండి దుర్వాసన విరజిల్లుతున్న పట్టించుకున్న పాపాన పోవట్లేదని గ్రామస్తులు తెలిపారు.పారిశుద్ధ్య పనులకు ఉపయోగించే ట్రాక్టర్ చెడిపోయిన సంగతి నడిపి డ్రైవర్ సంబంధిత అధికారి సెక్రెటరీకి తెలపాలి సెక్రెటరీ ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేసి ట్రాక్టర్ కు కావలసిన ఫండ్స్ మంజూరు చేసుకోని గ్రామంలోని చెత్త చెదారం లేకుండా సెక్రెటరీ శ్రద్ధ తీసుకొని పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని గ్రామస్తులు అన్నారు. మండలంలోని 17 గ్రామపంచాయతీలో 84 మంది మల్టీపర్పస్ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇష్టం గ్రామపంచాయతీ కార్మికులకు నెలకు 9.500 ప్రభుత్వం ప్రతి వ్యక్తికి వేతనాన్ని చెల్లిస్తుంది. ఇప్పుడు సకాలంలో ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలను సర్దుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా వారి వేతనాన్ని సకాలంలో అందిస్తూ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ సిబ్బంది వీధుల్లోకి రాకుంటే పంచాయతీ సెక్రెటరీ సిబ్బందిని మార్చి వెంటనే గ్రామంలోని పనులను సాఫీగా సాగేటట్టు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.