జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో అక్షర జ్యోతి పత్రిక ఆవిష్కరణ

జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మొగుల్ల భద్రయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కదిరి రాములు
కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి పటేల్
చిన్నంబావి మండలం 24 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త : చిన్నంబావి మండల పరిధిలోని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్జీవో)సభ్యులు హైదరాబాదులోని బీసీ సాధికారిక భవనంలోని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మొగుళ్ల భద్రయ్య ఆధ్వర్యంలో "అక్షర జ్యోతి పత్రిక" ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండలం నుంచి సభ్యులం పాల్గొనడం జరిగింది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా సామాజిక వార్తలు అందించడమే లక్ష్యంగా "అక్షర జ్యోతి పత్రిక " వెలసినది అని అన్నారు. సమ సమాజం స్థాపనలో భాగస్వాములు కాబోతున్న "అక్షర జ్యోతి పత్రిక "కు ముఖ్య అతిథులుగా వచ్చిన వారందరూ శుభాభివందనములు తెలియజేశారు. నిజాన్ని నిర్భయంగా రాయడమే "అక్షర జ్యోతి పత్రిక" లక్ష్యం అని అన్నారు. ఈ యొక్క అక్షర జ్యోతి పత్రిక ఆవిష్కరణలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జాతీయ మానవ హక్కుల కమిటీ వివిధ రాష్ట్రల అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొగుల భద్రయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కదిరి రాములు, కర్ణాటక రాష్ట్రా అధ్యక్షులు ప్రకాశ్ రెడ్డి పటేల్, రాష్ట్ర పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ యాదవ్, అఖిలభారత జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు పోలిశెట్టి విశ్వనాథం రెడ్డి, హైకోర్టు మాజీ హోంశాఖ ఏజీపీ గౌతమ్ కుమార్, తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ శివ వీరారెడ్డి, తెలంగాణ జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, బొమ్మిడాల మురళి, మాంచాలక్క, వివిధ జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, మేధావులు, జర్నలిస్టులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్, అధికారులు, న్యాయవాదులు, జాతీయ ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు, తాలూకా ప్రతినిధులు, అందులో భాగంగానే నాగర్ కర్నూల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటి జిల్లా అధ్యక్షులు చారకొండ బాబు, వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలం నాయకులు డేగ శేఖర్ యాదవ్, కోళ్ల అంజి, తగరం ఉగ్ర నరసింహ పాల్గొన్నారు. అక్షర జ్యోతి పత్రిక ఆవిష్కరణ వచ్చిన ఎన్ ఎచ్ ఆర్ సి కుటుంబ సభ్యులకు, మేధావులకు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.