ఆర్మూర్:డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 19 మందికి జైలు శిక్ష

Apr 12, 2024 - 20:51
Apr 12, 2024 - 20:52
 0  7
ఆర్మూర్:డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 19 మందికి జైలు శిక్ష

నిజామాబాద్, 12 ఏప్రిల్ 2024  తెలంగాణవార్త జిల్లా ప్రతినిధి:- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఏకకాలంలో 19 మందికి జైలు శిక్ష పడింది.రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ.. ఆర్మూర్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మొత్తం 256 మంది పట్టుబడ్డారు. వీరిలో 19 మందికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష పడింది.మిగతా వారికి రూ.4.43 లక్షల జరిమానాలు విధించారు.

Rajkumar.Ch Nizambad Staff Reporter Nizambad Distste Telangana State