రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు.

Apr 12, 2024 - 21:03
 0  12
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు.

జిల్లా SP రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు సూర్యాపేట పరిధిలో GMR, NHAI ప్రతినిధులతో జాతీయ రహదారిని పరిశీలించిన DSP రవి.

ఇటీవల కాలంలో జాతీయ రహదారిపై విరివిగా  జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు  ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు సూర్యాపేట DSP రవి తెలిపారు. శుక్రవారం జిల్లా SP అదేశాలమేరకు సూర్యాపేట పరిధిలోని టేకుమట్ల నుండి కోదాడ వరకు గల జాతీయ రహదారిపై తీసుకోవాల్సిన చర్యలను GMR, NHAI ప్రతినిధులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ... ఈమధ్య కాలంలో అతివేగంతో, మద్యం సేవించి ప్రయాణించే క్రమంలో జరిగిన ప్రదాలలో సుమారు పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారని తెలిపారు. అతివేగంతో రాత్రి పూట జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు గాను రోడ్డుకు ఇరువైపులా ప్రయాణానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రకటన బోర్డులను, చెట్లను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా నేటి యువత మద్యం సేవించి అతివేగంగా ప్రయాణించి ప్రమాదానికి గురై మృత్యువాత పడి తలిదండ్రులకు కడుపుకోత విధించొద్దని కోరారు.

ప్రతిఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. 

తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారకులైతే తల్లిదండ్రులతో పాటు వాహన యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈరోజు నిర్వహించిన రోడ్డు పరిశీలనలో తరచూ ప్రమాదాలు జరిగే కొన్ని బ్లాక్ స్పాట్ లను గుర్తించామని అట్టి వాటిపై తక్షణ నివారణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. DSP వెంట సూర్యాపేట రూరల్ CI సురేందర్ రెడ్డి, SI బాలు నాయక్, GMR, NHAI ప్రతినిధులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333