సాగర్ నీటితో చెరువుల గుండాల నింపాలి.... సామాజిక కార్యకర్త గంధం సైదులు
మునగాల 19 జులై 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి:-
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీటి అవసరాల నిమిత్తం ప్రభుత్వం నీటిని విడుదల చేసినందున కాల్వ పరిధిలోని గ్రామాల్లో గల చెరువులను కుంటలను సాగర్ నీటితో నింపాలని సామాజిక కార్యకర్త గంధం సైదులు ప్రభుత్వాన్ని కోరారు. గత వేసవికాలం నుంచి వర్షాలు లేకపోవడంతో చెరువుల్లో కుంటల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి అని. ఫలితంగా చాలా గ్రామాల్లో త్రాగు నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గత మూడు నెలల క్రితం నీరు విడుదల చేసినప్పటికీ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పాలేరు జలాశయానికి పోలీసు ప్రహారాతో నీటిని తీసుకెళ్లారని అవి నేరుగా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ కే పంపించడంతో కాలువ పరిధిలో ఉన్న గ్రామాల్లో చెరువులు నింప లేని పరిస్థితి నెలకొని చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోయాయని. ఎడమ కాలువ కాలువను ఆనుకోని ఉన్న గ్రామాలకు సైతం నీరు విడుదల చేయకపోవడం ప్రభుత్వ తీర్పు నిదర్శమని ఇప్పటికైనా వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్న చెరువులు నిండే వాన రాకపోవడంతో త్రాగునీటి ఇబ్బందులు తప్పడం లేదని కావున ప్రస్తుతం ఎడమ కాలవకు 5500 క్యూసెక్కుల నీరు విడుదల చేసినందున తక్షణమే ఎడమ కాలువ పరిధిలోని చెరువుల కుంటలని తక్షణమే నింపాల్సిన అవసరం ఉందని. ఈ విషయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు చొరవ తీసుకొని ఆయకట్టు రైతుల అవసరాల నిమిత్తం చెరువులు కుంటలు నింపాలని వారు కోరారు .