అసలు ఇల్లే కట్టలేదు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్టు రికార్డులు 

 లబోదిబోమంటున్న లబ్ధిదారులు 

Sep 16, 2025 - 18:56
 0  0
అసలు ఇల్లే కట్టలేదు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్టు రికార్డులు 

 జోగులాంబ గద్వాల 16 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ధరూర్.*మండలం అల్వలపాడులో జరిగిన తతంగం *ఆదేలేదురా అబ్బాయి అంటే.. పిల్లలపేర్లు నమోదాయ్యాయి సూడు అన్నట్టుంది. వెనుకటి సామెతలా ఉంది అధికారుల తీరు. అల్వాల పాడుకు చెందిన కేపి తిప్పన తండ్రి కెపి గొర్ల నరసన్న అనే వ్యక్తి పేరుమీద ఇందిరమ్మ ఇల్లు మంజూరి అయినట్టు రికార్డులు చూపిస్తున్నాయి. అసలు గమ్మత్తు ఏమిటంటే తిప్పన్నకు ఇల్లు మంజూరైనట్టు రికార్డుల్లో చూపిస్తున్నా అసలు తిప్పన్న ఇల్లే కట్టుకోలేదు ఇప్పటికీ రేకుల గుడిసెలోనే కాపురం చేస్తున్నాడు. గత కాంగ్రెస్ హయాంలో పేదలు పక్కా ఇల్లు నిర్మించుకొని బాగుపడాలని ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తే అధికారులు బ్రోకర్లు కుమ్మకై ఎన్నో ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే కొన్ని లక్షల రూపాయలను స్వాహా చేసినట్టు గతంలో కొందరు అధికారులను సస్పెండ్ చేసినట్టు కూడా పత్రిక కథనాలు విన్నాము

 అధికారుల లాలుచితనం లబ్దిదారులకు శాపం 

గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను ఆర్థిక స్తోమత ఉన్న వాళ్లు కొందరు ఇండ్లు నిర్మించుకుంటే ఆర్థిక స్థోమత లేని వాళ్ళు  ఇల్లు నిర్మించుకోలేక ఊరికే ఉన్నారు. ప్రభుత్వo  మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పట్టాలను తీసుకొని అధికారులు బ్రోకర్లు కుమ్మకై వాటి పేరు మీద లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే బిల్లు ఎత్తేసారని అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ఇంటి నిర్మించుకోకుండా ఉన్న లబ్ధిదారులు ఇప్పుడు ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుందని తెలియగానే ఇల్లు నిర్మించుకోవడానికి పూనుకుంటే  గతంలోని అధికారుల కుంభకోణం వల్ల బిల్లు మంజూరైనట్టు చూపిస్తున్నందువల్ల లబ్ధిదారులు అవాక్కయ్యారు. అసలు మేము ఇల్లే కట్టలేదు మాకు బిల్లు ఏవరిచ్చారు అంటూ లబోదిబోమంటున్నారు.
అల్వాలపాడు కు చెందిన తిప్పన ఇంటి మంజూరు కోసం దాదాపు గత ఆరు నెలల నుంచి గ్రామపంచాయతీ మొదలుకొని మండల ఎంపీడీవో మరియు కలెక్టర్ ఆఫీస్ కి ఎన్ని సార్లు తిరిగిన అధికారులు మాత్రం నీ పేరున బిల్లు మంజూరైనది మేమేమి చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఒక నెల కింద జిల్లా కలెక్టర్ పరిశీలనకు పంపిస్తామంటూ చెప్పడం వల్ల కొందరు అధికారులు వచ్చి పంచనామా చేసి వెళ్లారు. అయినను పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది. మరి నా పరిస్థితి ఏమిటని తిప్పన్న అధికారులను ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుత పాలకులైన అధికారులైన నాలాంటి సమస్యను ఎందరో పేదవారు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మాకు పరిష్కార మార్గం చూపండని వేడుకుంటున్నాడు.

ప్రభుత్వ పథకాలు అంటే అందరికీ ఆశగానే ఉంటుంది అందులో భాగంగానే గతంలో కానీ ఇప్పుడు కానీ  ప్రభుత్వ పథకాలు పేదలు బాగుపడాలని ప్రభుత్వం పథకాలను విడుదల చేస్తే, ప్రజలు పథకాల కోసం కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు డబ్బుకి కక్కుర్తి పడి, ఈ విధమైన మోసాలు చేస్తే బీదల పరిస్థితి ఏంటని, అల్వాలపాడు తిప్పన పరిస్థితి కాక జిల్లాలో ప్రతి మండలంలో ఇటువంటి తప్పిదాలు చేసిన అధికారులపై ప్రభుత్వాలు ఇకనైనా పైరవిదారులపై గతంలో తప్పిదాలు చేసిన అధికారులపై ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేసి శాఖ పరమైన చర్యలు తీసుకొని మోసపోయిన లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
 వివరణ : - పంచాయతీ కార్యదర్శితో చెరవాణిలో సంప్రదించగా గతంలో తిప్పన్నకు మంజూరైన విధంగా రికార్డులు చూపిస్తున్నాయని అందువల్ల మేము ఏమి చేయలేము అని పంచాయతీ కార్యదర్శి అన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333