భారత విప్లవోద్యమ అగ్రనేత,ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41 వ వర్ధంతి సందర్భంగా
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : భారత విప్లవోద్యమ అగ్రనేత,ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి ప్రతిఘటన పోరాట నిర్మాత,భారత విప్లవోద్యమ అగ్ర నాయకులు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ.వర్ధంతి సందర్భంగా ఏపూరు గ్రామంలో అమరుడు కామ్రేడ్ జన్ను సార్ స్తూపం ముందు గ్రూప్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. *ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షలు కునుకుంట సైదులు, అరుణోదయ జిల్లా కార్యదర్శి కంచనపల్లి సైదులు లు పాల్గొని మాట్లాడుతూ* భారత విప్లవొద్యమానికి చండ్ర పుల్లారెడ్డి దిశ,దశను నిర్దేశించిన విప్లవ చుక్కాని అని అన్నారు.ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి విప్లవొద్యమంలో అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం తపించి రివిజనిజానికి,నాయా రివిజానిజానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ సిద్ధాంత కర్త చండ్ర పుల్లారెడ్డి అని అన్నారు. అడివి లో అడుగుబెట్టి గోదావరి ప్రాంతంలో పార్టీని విస్తరింప చేసి ఆదివాసిలకు అండగా నిలిచారు.వేలాది ఎకరాలు భూమిని పంచిపెట్టి 14రాష్టాల కు విప్లవొద్యమాన్ని నిర్మించాడని అన్నారు.పొట్ల రామ నర్సయ్య,నీలం రామ చంద్రయ్య,బత్తుల వెంకటేశ్వర్ రావు ల నుండి మొదలు బూటకపు ఎన్ కౌంటర్ లో అమరులైన కా,లింగన్న, బాటన్న,మారోజు వీరన్న, దొరన్న,శంకరన్న, రంగవల్లి,పజ్జురు కృష్ణారెడ్డి లతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యానాల మల్లారెడ్డి, విక్రమ్,చంద్రారెడ్డి,జెన్ను, పలస బిక్షం,బూరుగు అంజన్న,గడ్డం అమృత రెడ్డి, పిడమర్తి వెంకన్న, అలుగుబెల్లి,కాకి లక్ష్మారెడ్డి, యానాల వీరారెడ్డి,ఏనుగుల మోహన్,బాదె రాము, తొట్ల కుమారస్వామి లాంటి ఎంతోమంది విప్లవ కారులు పిడిత ప్రజల కోసం జీవితాంతం పోరాడి అమరులయ్యారని అన్నారు. వారు దోపిడీ, పీడన, అసమానతలు రద్దు కావాలని కోరుకొని నూతన సమాజం కోసం కలలు కన్నారని అన్నారు.వారి ఆశయ సాధనలో అశేష ప్రజానీకాన్ని పోరాటం వైపు మల్లించాలని అన్నారు. నేడు దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక,కార్పొరేట్ అనుకూలం విదానాలను అనుసరిస్తూ ఫాసిస్ట్ పాలనను వేగవంతం చేస్తుందని దుయ్యబట్టారు.ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ ను అందలం ఎక్కిస్తుందని అన్నారు. కార్పొరేట్ అభివృద్దె దేశ అభివృద్ధిగా ప్రచారం చేస్తుందని తెలిపారు.దేశ సంపదను అదాని,అంబానీ లకు కట్టబేడుతుందని,అడవి సంపద ను కొల్లగొట్టడానికి ఆఫరేషన్ కాగార్ పేరుతో ఆదివాసులను, మావోయిస్టులను హత్యలు చేస్తుందని అన్నారు. రాష్ట్రములో రేవంత్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని అన్నారు.రైతు పంటను కొనుగోలు చేయడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహారిస్తోందని అన్నారు. అమరవీరుల స్ఫూర్తి తో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలపై బలమైన విప్లవ పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ *కర్యక్రమం లో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు జిలేర్, రవిగోపాల్,ఎల్లయ్య,గ్రామ కార్యదర్శి సుదగాని వెంకన్న,పి వై ఎల్ మండల నాయకులు కుంట రవి,ఎస్ కే ముజీబ్, ఎస్ కే ఇబ్రహీం, బోల్క బిక్షం తదితరులు పాల్గొన్నారు.*