**అలసిపోయావని మారకద్రవ్యాలు కు అలవాటు పడితే జీవితం అందాకారమే""ఎస్సై రవీందర్ , నేరేడుచర్ల పిఎస్*

తెలంగాణ వార్లా ప్రతినిధి నేరేడు చర్ల : లారీఅసోసియేషన్ వద్ద కూలీలకు డ్రగ్స్ పై అవగాహన.
అలసిపోయామని డ్రగ్స్ కు అలవాటైతే, జీవితం అందాకరమే - రవీందర్ SI, నేరేడుచర్ల పిఎస్.
మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో పట్టణంలో గల లారీ అసోసియేషన్ కార్యాలయం వద్ద లారీ డ్రైవర్లకు, కూలీలకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్సై రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా ఎస్పీ గార్ల ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఎక్కడైనా గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వినియోగిస్తున్న అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందించి నివారించడంలో సహకరించాలని కోరారు. సుదూర ప్రాంతాలకు వాహనాలు నడుపుతూ అలసిపోయి ఉంటారు ఈ క్రమంలో డ్రగ్స్ కు ఎవరైనా అలవాటు పడితే తాత్కాలిక సుఖం వచ్చిన ఆరోగ్యం క్షమిస్తుందని అన్నారు. ఈ డ్రగ్స్ నియోగించడం వల్ల నాడీ వ్యవస్థ పూర్తిస్థాయిలో క్షీణిస్తుంది అన్నారు. విపరీతమైన మత్తులో ప్రమాదాల బారిన పడతారని తెలిపారు. ఎవరైనా ఇలాంటి డ్రగ్స్ విక్రయించిన, వినియోగించిన పోలీసులు సమాచారం ఇవ్వాలి అని ఎస్ఐ కోరారు.