అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన
వాగ్మారే సుభాష్

తెలంగాణ వార్త 14 ఏప్రిల్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:- నిజామాబాద్ నగరంలోని పూలంగ్ చౌరస్తా లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారం రోజు బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నీటితో శుద్ధి చేస్తున్నాడు.అనంతరం డాక్టర్:బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా విగ్రహానికి పాలభిషేకం చేసి,పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అంబేద్కర్ అభిమాని వాగ్మారే సుభాష్.మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డాక్టర్:బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని,బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతగా ఉద్దేశ్య భవిష్యత్తును ముందుగానే ఊహించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన గొప్ప దార్శనికుడు.అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో అడుగులు వేసిందని అన్నారు.