పల్లోటి హైస్కూల్లో బాల్య వివాహాల అవగాహన సదస్సు

పల్లోటి హైస్కూల్లో బాల్య వివాహాల అవగాహన సదస్సు
అడ్డగూడూరు 16 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:_ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందపురం గ్రామంలో "సెయింట్ విన్సెంట్ పల్లోటి"ఉన్నత పాఠశాల పాఠశాల ఆవరణ యందు "స్కోప్" స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండల కో ఆర్డినేటర్ కురిమేటి యాదయ్య విద్యార్థిని, విద్యార్థుల మరియు ఉపాద్యాయుల చేత "బాల్య వివాహాలు లేని భారతదేశం కోసం"అనే అంశం పై అవగాహన కల్పిస్తూ.. బాలకార్మికులు,డ్రాప్ ఔట్, బాల్య వివాహాలు నిర్మూలన సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు. పిల్లలందరూ మీ మీ గ్రామాలలోగానీ పట్టణాల్లో,నగరాల్లో బాల్య వివాహాలు ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు. మీకు తెలిసినా, మీరు చూసినా " చైల్డ్ లైన్" టోల్ ఫ్రీ నెంబర్ 1098,పోలీస్ శాఖ 100కి "స్కోప్" సంస్థ వారికి కాల్ చేసి చెప్పాలని పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించారు. మరియు అంగన్వాడీ టీచర్, ఆశవర్కర్, పాఠశాల టీచర్లకు, ఎమ్మార్వోకి, ఐసిడిఎస్ టిడిపిఓకి, గ్రామ పంచాయితి కార్యదర్శికి, ప్రజాప్రతినిధులకు తమ వంతు సామాజిక బాధ్యతగా సమాచారం ఇవ్వాలని బాల్య వివాహాలు లేని భారత దేశం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అరుల్ సెల్వి, ఉపాద్యాయనీ, ఉపాధ్యాయులు రీనా శాలిని,E సైదయ్య, జ్యోతి రాణి,ఫ్ కనకయ్య,కీర్తన స్వాతి తదితరులు,నాన్ టీచింగ్ సిబ్బంది మరియు పాఠశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.