అర్హులైన వారికే సంక్షేమ పథకాలు :ఎమ్మెల్యే సామేలు

Dec 28, 2025 - 09:11
 0  437
అర్హులైన వారికే సంక్షేమ పథకాలు :ఎమ్మెల్యే సామేలు

  తిరుమలగిరి 28 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

 - రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలను అందిస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శనివారం తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అధికారుల ఎంపిక జాబితా వెల్లడించారు. మున్సిపాలిటీ వార్డులలో పేర్కొన్న సమస్యలపై మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు డ్రైనేజీ,మురికి కాలువల సీసి రోడ్ల పనులకు 15కోట్ల నిధులు మంజూరు అయ్యాయని,త్వరలోనే పనులను ప్రారంభిస్తామని చెప్పారు. మున్సిపాలిటీలోని 15 వార్డులకు 220 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని ప్రకటించారు.తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని, ప్రధాన చౌరస్తాలో మరుగుదొడ్లు,మూత్ర శాలలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని త్వరలో ప్రజలకు సమస్యలేకుండా పరిష్కరిస్తామని తెలిపారు. తిరుమల హిల్స్ కాలనీలో సిసి రోడ్లు పెండింగ్ సమస్యలను పరిష్కారం చేస్తారని తెలిపారు. త్వరలో రాబోయే మున్సిపల్ ఎఎన్నికల లో అన్ని వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా ప్రయత్నించాలు కార్యకర్తలు,నాయకులుచేసుకోవాలని, మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పారు. ప్రతి కార్యకర్త నాయకులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.అర్హులైన ప్రతి పేద వారికి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినట్లు తెలిపారు.ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు వై.నరేష్, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, జిల్లా నాయకులు సుంకర జనార్ధన్, జిల్లా అధికార ప్రతినిధి ఎస్. కొండల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మిలాల్, మున్సిపల్ మాజీ చైర్మన్ చాగంటి అనసూయ రాములు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాలపు చంద్రశేఖర్, మూల అశోక్ రెడ్డి, కందుకూరు లక్ష్మయ్య, బత్తుల శ్రీను, అంబేద్కర్, తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి