గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు,కట్టుబా ట్లు, వారి పాతకాలపు

Dec 27, 2025 - 20:14
 0  1
గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు,కట్టుబా ట్లు, వారి పాతకాలపు
గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు,కట్టుబా ట్లు, వారి పాతకాలపు
గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు,కట్టుబా ట్లు, వారి పాతకాలపు
గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు,కట్టుబా ట్లు, వారి పాతకాలపు
గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు,కట్టుబా ట్లు, వారి పాతకాలపు

వస్తువులను గిరిజన మ్యూజియంలో పొందుపరచి పివో ఐ టి డి ఏని అభినందించిన ఉపాధ్యాయులు & విద్యార్థులు.
 
తెలంగాణ వార్త డిసెంబర్ 27 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు నేటితరం విద్యార్థినీ విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండడంతో పాటు పాతకాలపు గిరిజనుల ఆచార వ్యవహారాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని భద్రాచలం దివ్య హైస్కూల్ ప్రిన్సిపాల్ కెవి రమణ, ఏ భారతి అన్నారు. శనివారం నాడు భద్రాచలంఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను భద్రాచలం దివ్య హైస్కూల్ ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న బాల బాలికలు 170 మంది మరియు 08 మంది ఉపాధ్యాయి నీలు సందర్శించి మ్యూజియంలో పొందుపరిచిన గిరిజనుల అన్ని కళాఖండాలను క్లుప్తంగా తిలకించి చిన్నపిల్లలు సరదాగా మ్యూజియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రీడాస్థలంలో ఆటలు ఆడుకున్న అనంతరం ఉపాధ్యాయులుమాట్లాడుతూ అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు నేటితరం బాల బాలికలకు తెలిసే విధంగా కళాఖండాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి యొక్క చరిత్రను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తెలుగులో ముద్రించి ప్రదర్శించడం వలన విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగతమైందని, మ్యూజియంలో మాత్రం గిరిజనులకు సంబంధించిన స్పష్టమైన సమాచారం విద్యార్థులకు తెలిసే విధంగా మ్యూజియం నిర్వహకులు ప్రతి అంశం తెలియజేయడం చాలా బాగుందని అన్నారు. పాఠశాల, కళాశాలలకు మ్యూజియం సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అవకాశం కల్పించి విద్యార్థిని, విద్యార్థులకు ఆటవీడుపుగా ఇటువంటి సందేశాలు ఉన్న గిరిజన కళాఖండాలు చూపెట్టడం వలన వారిలో మేధాశక్తి పెరిగి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల గురించి పూర్తిస్థాయిలో తెలుసు కుంటారని అలాగే పాతతరం గిరిజనులు వాడే పనిముట్లు, ఆదివాసి గిరిజనుల సంస్కృతి భాష మరియు గిరిజనుల వేషధారణ కనుమరుగు కాకుండా కోయ భాషను పి ఓ రాహుల్ నేర్చుకొని భాష యొక్క అంతర్యాన్ని గిరిజనులు మరిచిపోకుండా అందరూ ఆచరించే విధంగా ఆయన చేస్తున్న కృషికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు. అలాగే మ్యూజియం ప్రాంగణంలో చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన బోటింగ్ పాయింట్, సెల్ఫీ పాయింటు, పాతకాలపు ఇండ్లు చూడముచ్చటగా ఉన్నాయని, చిన్నపిల్లల కోసం ఏర్పాటుచేసిన క్రీడాస్థలం చాలా బాగుందని అన్నారు.


    ఈకార్యక్రమంలో దివ్య హై స్కూల్ నిర్వాహకులు,ఉపాధ్యా యులు విజయలక్ష్మి, భారతి, రహమాన్, కాసిం, నరేష్, విజయరామ్, మ్యూజియం నిర్వహకులు వీరాస్వామి, మాధవి, చలపతిరావు మరియు విద్యార్థినీ విద్యార్థులు, బాల బాలికలు పాల్గొన్నారు. 
ఎండ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333