శాసనసభ్యులు యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలు

కొడకండ్ల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలు*

Feb 3, 2025 - 21:21
Feb 3, 2025 - 21:23
 0  6
శాసనసభ్యులు యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలు

కొడకండ్ల 03 పిప్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు యశస్విని ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి ప్రజా సంక్షేమాన్ని ముందుంచుకొని పనిచేస్తున్న నాయకురాలు. పాలనలో పారదర్శకత, అభివృద్ధికి వారి కృషి ఎనలేనిది" అని కొనియాడారు.సామాజిక సేవలో వారు చూపుతున్న ప్రాముఖ్యత, నియోజకవర్గ అభివృద్ధి పట్ల వారు కట్టుబాటు చాలా గొప్ప విషయం. నూతన వయసులో మరింత శక్తి, సంపద లభించి, ప్రజా సేవలో కొనసాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం" అని తెలిపారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. తనను అభిమానించి ప్రేమించి ఆశీర్వదించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తాను. మీ అభిమానం, సహకారం ఎప్పుడూ ఉంటేనే మంచి మార్పులు తీసుకురాగలం" అని అన్నారు.ప్రజల అభివృద్ధికి పనిచేయడం నా కర్తవ్యమని, న్యాయసమ్మతంగా, నిబద్ధతతో ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు.ఈ వేడుకల్లో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువనాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని, జన్మదినాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు. స్వీట్లు పంపిణీ చేసి, కార్యకర్తలు వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరిపారు.