వనమా రాఘవ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి వనమాకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు
పాల్వంచ నవంబర్ 1 : మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా వారి నివాసం పాత పాలంచలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రజా నాయకుడు ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉండే వనమా వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా పాత పాల్వంచ వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన చైర్మన్లు కౌన్సిలర్లు మాజీ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు పలువురు నాయకులు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు దంపతులకు శాలువాగప్పి బొకే అందజేసి స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ స్థాయి నుంచి ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఎదిగి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా క్షేత్రంలో ప్రజల మనిషిగా స్థిరస్థాయిగా పేద బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గా మనసులలో నిలిచిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాత్రమేనని వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారులు వనమా నివాస ప్రాంగణంలో మాజీ మంత్రి వర్మ వెంకటేశ్వరరావు చేతులతో మొక్కలు నాటడం జరిగింది .ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ కాపు సీత లక్ష్మి కాపు కృష్ణ దంపతులు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్ ఖంపెల్లి కనకేష్ మాజీ ఎంపీపీలు శాంతి సోనా వైస్ చైర్మన్ దామోదర్ కౌన్సిలర్లు ప్రసాద్ బాబు రుక్మేందర్ బండారి వేణు గోపాల్ సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .