శ్రీ కృష్ణావతారంగా భక్తులకు దర్శనం ఇచ్చిన భద్రాద్రి రామయ్య
తెలంగాణ వార్త డిసెంబర్ 28 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : దివ్య క్షేత్రం భద్రాద్రిలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి, దశావతార మహోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మగా భక్తులకు దర్శనం ఇచ్చారు. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంటూ భక్తులు పెద్ద ఎత్తున శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకున్నారు. హరే రామ హరే రామ రామ రామహరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అంటూ భక్తులు స్వామివారిని ప్రార్థించారు. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు దేవస్థానం వారు తీర్థప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు దేవస్థానం నుండి ఖర్చులు అధికంగా అయితాయి. ఆదాయం అంతంత మాత్రం గానే ఉంటుంది. ఈ విషయం గమనించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీ దామోదర్ రావు ఉత్సవాల పట్ల ప్రత్యేక శ్రద్ధను పెట్టి ఈ ఉత్సవాలకుఆర్థిక సహకారం దేవస్థానంవారికి అందే విధంగా రామాలయం ఈవో పథకం రూపొందించుకుని స్థానిక ప్రముఖులను, దాతలను ఒప్పించి సఫలీకృతం అయ్యారు. ఇందుకు దేవాదాయ శాఖ మరియు జిల్లా అధికారులు, భక్తులు కార్యనిర్వాహణాధికారిని అభినందిస్తున్నారు. ఈ ఉత్సవాల పట్ల జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఏ ఎస్ పి, స్థానిక వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలు అన్ని ప్రభుత్వ సంస్థలు తమ వంతు సహకారం అందిస్తూ ఈ ఉత్సవాలు జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నారు. స్వామివారి ఉత్సవాలలో స్థానికుల సహాయ సహకారాలు తీసుకుంటూ ఉత్సవాలను జయప్రదంగా చేస్తున్నందుకు స్థానిక ప్రజలు భక్తులు రామాలయం ఈవోను మెచ్చుకుంటున్నారు.