YOGA " తో .. ఆరోగ్యం పదిలం :- డీఎంహెచ్వో  డాక్టర్ శశికళ 

Jun 21, 2024 - 17:56
 0  5
YOGA " తో .. ఆరోగ్యం పదిలం :- డీఎంహెచ్వో  డాక్టర్ శశికళ 
YOGA " తో .. ఆరోగ్యం పదిలం :- డీఎంహెచ్వో  డాక్టర్ శశికళ 

జోగులాంబ గద్వాల 21 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-. గద్వాల. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఈరోజు "అంతర్జాతీయ యోగా దినోత్సవం" సందర్భంగా పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ మరియు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి రాజు  పల్లె దవఖాన రాష్ట్ర అధ్యక్షులు  డాక్టర్ పి రవికుమార్  యోగా ఇన్స్క్టర్ ఎన్ త్రివేణి  జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతి ఒక్కరూ ఇట్టి కార్యక్రమంలో యోగా చేయడం జరిగింది.. డిఎంహెచ్వో  *మాట్లాడుతూ  ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం ప్రతి ఒక్కరూ యోగా చేసినట్లయితే  మనసు ప్రశాంతంగా ఒత్తిడిలకు లోను కాకుండా ఉంటారనియోగా ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు మరియు కోపమును జయించవచ్చును, డిప్రెషన్ ను కూడా తగ్గించవచ్చునని నిద్రలేమి ఉన్నవాళ్లు యోగా చేయడం ద్వారా నిద్ర సరిగా వచ్చునని ఇంకను  శరీరంలో హార్మోన్స్ సమతుల్యంగా ఉంచుటకు పని చేయనని  తెలిపారు ఇట్టి కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది.. సూపర్ ఇంటెండెంట్  ముని ప్రసాద్  జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333