లైసెన్స్ సర్వేయర్లు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

జోగులాంబ గద్వాల, 8మే 2005 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల లైసెన్సు సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మీసేవ కేంద్రాల ద్వారా లైసెన్స్ సర్వే శిక్షణ కార్యక్రమానికి ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ (గణిత శాస్త్రం) ఒక అంశంగా ఉండి కనీసం అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఐటిఐ నుండి డ్రాఫ్ట్ మన్ (సివిల్), డిప్లమా సివిల్, బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైన విద్యా అర్హత కలిగి ఉండాలి. శిక్షణ ఫీజు ఓసి అభ్యర్థులకు రూ. 10,000/- లు, బీసీ అభ్యర్థులకు రూ. 5,000/- లు, ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు రూ. 2,500/- చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రంలో మొత్తం 50 పనిదినాలలో తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. అభ్యర్థులు మీసేవ కేంద్రాల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9849081489: 732634404: 9441947339 లకు సంప్రదించాలని సూచించారు.