తుంగతుర్తి మండల సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా బుర్ర శ్రీనివాసు ఎన్నిక

తుంగతుర్తి నవంబర్ 05 తెలంగాణ వార్త ప్రతినిధి:- సిపిఎం పార్టీలో సుదీర్ఘంగా ఉంటూ ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ సిపిఎం పార్టీ సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకొనిఆ పార్టీ ఆశయాల కోసం అంకితమై పని చేస్తున్న నిజాయితీపరుడుగా ఉంటూ అనునిత్యం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బుర్ర శ్రీనివాస్ ను సోమవారం జరిగిన తుంగతుర్తి మండల మహాసభలో తిరిగి ఏకగ్రీవంగా మండల కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది ఆయన ఎన్నిక పట్ల సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మల్లు నాగార్జున రెడ్డి మరియు కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు కోట గోపి చెరుకు యాక లక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం కందాల శంకర్ రెడ్డి తోపాటు పార్టీ మండల కమిటీ సభ్యులు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు