జిల్లా ఎస్పీ రితిరాజ్, కి వీడ్కోలు కార్యక్రమము నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు
జోగులాంబ గద్వాల 21 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- జిల్లా ఎస్పీ రితిరాజ్,IPS కి ఈరోజు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయం లోని గ్రివెన్స్ హల్ నందు వీడ్కోలు సమావేశం నిర్వహించి సన్మానించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ తో పాటు ఇతర కార్యక్రమాల ద్వారా తక్కువ కాలం లో ప్రజల కు మరింత దగ్గరగా పోలీసింగ్ ను అందజేసి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. విధులలో భాగంగా ఎదురయ్యే సమస్యలనూ అదికమించడం లో ఇచ్చిన సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి, పోలీస్ వెల్ఫేర్ కు తీసుకున్నా చర్యలను, మహిళా సాధికారతకు, విద్యార్థుల ను చదువు వైపు ప్రోత్సహించడం వంటివి చేపట్టినా కార్యక్రమాలను కొనియాడారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గత 9 నెలల కాలంలో జిల్లా లోని లా & ఆర్డర్ తో పాటు MLA మరియు MP ఎన్నికలను సజావుగా నీర్వహించడం జరిగిందని అందుకు హోమ్ గార్డు అధికారి నుండి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరి కృషి ఉందని అన్నారు. అందుకు అందరికీ నా అభినందనలు అని అన్నారు. ప్రతి ఒక్క అధికారి సిన్సియర్ గా పని చేస్తేనే చేసే పనిలో సంతృప్తి ఉంటుందని తద్వార ప్రజల మన్ననలు పొందుతారని అన్నారు. పోలీస్ అధికారులు సిబ్బంది చేసే పనిలో ఇన్సియేటివ్ గా వర్క్ చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారని, గద్వాల్ జిల్లా ఎన్నో అనుభవాలను నేర్పించి జ్ఞాపకాలని ఇచ్చిందని ఎస్పీ జిల్లా ప్రజలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమం నందు డి. ఎస్పీ కె.సత్యనారాయణ , సాయుధ దళ డి.ఎస్పీ నరేందర్ రావు , కార్యాలయ ఏ . ఓ సతిష్ కుమార్ , సి . ఐ లు భీమ్ కుమార్, రవి బాబు, కె.ఎస్ రత్నం, ఎస్బి, సీసీఎస్, ఇన్స్పెక్టర్స్ జమ్ములప్పా, వేంకటేశ్వర రెడ్డి, అర్.ఐ లు వెంకటేష్, హరీఫ్ , జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, అన్ని విభాగాల ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.