శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తజనం.
జోగులాంబ గద్వాల3 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: వసంత పంచమి సందర్భంగా.. అలంపూరు పట్టణంలోని శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులు. శ్రీ జోగులాంబ అమ్మవారి నామస్మరణంతో మారుమోగిన పుర వీధులు. అలంపూరు పట్టణం & మండలంలోని వివిధ గ్రామాల నుండి కలశాభిషేకాలతో అమ్మవారికి అభిషేకం చేయడానికి వందలాదిగా తరలివచ్చిన మహిళలు.