కలెక్టర్ మరియు డిఇఓ ఆదేశాలకు విరుద్ధంగా
అయిజ మండల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తరగతుల నిర్వహణ
ఎంఈఓ ఆఫీస్ కు కూతవేటు దూరంలో కృష్ణవేణి పాఠశాల
చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ఎంఈఓ
జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- కురుస్తున్న బారీవర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ మరియు డీఈఓ ఆదేశానుసారం సోమవారం 2/ 9/2024న పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించారు. అయినప్పటికీ ఐజ మండల కేంద్రంలోని ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారీతిన తరగతులు నిర్వహిస్తూన్నారు. దీనికి మీడియా వివరణ కోరగా వాతావరణం అనుకూలించింది కాబట్టి తరగతులు నిర్వహిస్తున్నామని కృష్ణవేణి స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. వాతావరణం అనుకూలించింది కానీ ఇంకా వాగులో,వంకలు, లో వరద తగ్గలేదు. కృష్ణవేణి స్కూల్ యజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ నడపడం వల్ల విద్యార్థులు ఈ రోజు నేను క్లాస్ మిస్ అవుతాను అనే భయంతో, స్కూల్ టీచర్లు తిడతారనే భయంతో, స్కూల్ కి రావాల్సిన పరిస్థితి వాగులు వంకలు దాటే క్రమంలో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యులు. చట్టానికి వ్యతిరేకంగా స్కూల్ నడుపుతున్న యజమాన్యం?
తమ పిల్లలు చదువుకొవాలని స్కూలుకు పంపించిన తల్లిదండ్రుల?
చట్ట విరుద్ధంగా, ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా క్లాసులు నడుపుతున్న కృష్ణవేణి స్కూల్ యజమానంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.