ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలో మట్టి మాఫియా బరితెగించిది
యదేచ్చగా ఇష్టానుసారంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి నిత్యం మట్టి తోలకాలు చేపడుతున్నారు...ఇద్దరు వ్యక్తులు సిండికేట్ గా మారి మట్టి మాఫియాకు తెర లేపారు.ప్రవేట్ స్థలాల్లో ఒకొక్క ట్రిప్పు 50 రూపాయాలకు కొనుగోలు చేసి కమర్షియల్ ప్లాట్స్ కు 400 నుండి 500 వరకు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు.మట్టి తోలకాల్లో వందలాది ట్రాక్టర్లు రోడ్ల పై స్పిడ్ కంట్రోల్ లేకుండా తిరగటంతో రోడ్లు నాశనం అవ్వటమే కాక ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందో అని కుప్పెనకుంట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అడ్డగోలుగా సాగుతున్న మట్టి తోలకాల పై స్థానికులు మట్టి మాఫియా ను ప్రశ్నిస్తే దాడులకు సైతం వెనకడటం లేదు.పైగా ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకొండి మాకు భయం లేదు అధికారులందరికి ఇవాల్సిన మాములు ఇస్తున్నం మాకేం భయం లేదంటూ ప్రశ్నించిన వాళ్ళపై దాడులకు తెగపడ్డారు.మట్టి మాఫియా ఎంతగా రెచ్చిపోతుందో అర్దం అవుతుంది..సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకోవటంలేదని,మట్టి మాఫియా కనుసన్నలోనే అధికారులు పని చేస్తున్నారని అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిత్యం వందలాది ట్రాక్టర్లతో మట్టి తొలకాలు జరుగుతున్న అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరించటం పై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..ఇప్పటికైనా ఉన్నతాధికారులు మట్టి మాఫియా పై దృష్టి పెట్టి అక్రమ మట్టి తోలకాలను నిరోధించాలని స్థానికులు కోరుకుంటున్నారు..