ఇరాన్ పై యుద్దాన్ని అమెరికా ఇజ్రాయిల్ లు ఆపాలి

Mar 6, 2026 - 07:39
 0  1
ఇరాన్ పై యుద్దాన్ని అమెరికా ఇజ్రాయిల్ లు ఆపాలి

ఇరాన్ పై యుద్దాన్ని అమెరికా ఇజ్రాయిల్ లు ఆపాలి

సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక

సూర్యాపేట: ఇరాన్ పై యుద్దాన్ని అమెరికా, ఇజ్రాయిల్ లు ఆపాలని సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక డిమాండ్ చేసింది.సామ్రాజ్యవాద దాడులను ఖండించాలని కోరుతూ సూర్యాపేట కొత్త బస్టాండ్ దగ్గర సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేదిక కన్వీనర్ లింగంపల్లి భద్రయ్య మాట్లాడుతూ అమెరికా అమానుషంగా పిల్లలపై దాడులను ,పాఠశాలలపై దాడులను చేస్తూ యుద్ధనీతిని వదిలేసి దేశాలపైన ఆధిపత్యం కోసం జరిపేటువంటి దాడిని వెంటనే ఆపి శాంతి వాతావరణము కల్పించాలని, దీనిని భారత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఖండించి ప్రపంచశాంతిని కాంక్షించాలని సూచించారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మండారి డేవిడ్ కుమార్, మాట్లాడుతూ ఇందన వనరులపై ఆధిపత్యం కొనసాగించడం కోసం మాత్రమే ఈ ఆటవిక దాడి ఇరాన్ పై జరగడం చాలా విచారకరం. సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వెంటనే అ మానుష దాడులను ఆపి శాంతి వాతావరణం కల్పించాలని కోరారు. అబ్దుల్ కరీం మాట్లాడుతూ అమెరికా అన్ని దేశాలపై ఆధిపత్యం కొనసాగించాలని దేశ సార్వభౌ మాధికారాల మీద దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య మాట్లాడుతూ యుద్ధం తగదు ,శాంతి మాత్రమే ప్రపంచ అభివృద్ధికి పరిష్కారమని యుద్ధాన్ని వెంటనే ఆపేసి చర్చలు జరిపి శాంతిని పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎస్ నాయకుడు వీరన్న, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, దళిత బహుజన మహాసభ నాయకులు వెంకట్ యాదవ్, రైతాంగ నాయకులు మాధవ రెడ్డి , డీ టీ ఎఫ్ నాయకులు కే యోగానంద చారి, సి హెచ్.వెంకటయ్య,రాంసింగ్, షేక్ ఉమర్, టీపీఎఫ్ నాయకులుకోటయ్య, బుద్ధ సత్యనారాయణ, పీ డీ ఎస్ యు నాయకుడు భరత్ , పి.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333