ప్రజావాణికి 28 ఫిర్యాదులు: జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్

Feb 3, 2025 - 19:26
 0  1
ప్రజావాణికి 28 ఫిర్యాదులు: జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్

జోగులాంబ గద్వాల 3 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయములోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 28 మంది తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణతో కలిసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు.వివిధ శాఖల జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333