వ్యవసాయ కార్మికులపై సర్కార్ చవితి తల్లి ప్రేమ *కూలిపోరాటాలకు సిద్ధం కావాలి

. ములకలపల్లి రాములు పిలుపు*  

Aug 8, 2024 - 19:50
Aug 8, 2024 - 19:58
 0  17
వ్యవసాయ కార్మికులపై సర్కార్ చవితి తల్లి ప్రేమ *కూలిపోరాటాలకు సిద్ధం కావాలి

కోదాడ 08 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- సమాజంలో నూటికి 70% ఉన్న వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చవితి తల్లి ప్రేమ చూపుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు విమర్శించారు   

గురువారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఆవరణలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపులు   కనీస వేతన చట్టం అమలుపై రౌండ్   టేబుల్  సమావేశానికి జరిగింది.

 ఈ సందర్భంగా వారు  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ  రెక్కాడి తినే   డొక్కాడే పేద వ్యవసాయ కూలీలకు  ప్రభుత్వ విధానాల వల్ల చేతినిండా పని లేక పస్తులతో వలసలు పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నూటికి 70% ఉన్న వ్యవసాయ కార్మికులు దళితులు. గిరిజనలు. బలహీన వర్గాలు నిత్యం పేదరికం అనుభవిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు   వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వల్ల వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 70  రోజులు కూడా పని దొరకటం లేదని వారన్నారు సంపదను సృష్టిస్తున్న వ్యవసాయ కూలీల. పేద రైతుల  పట్ల పాలకవర్గాల చవితి తల్లి ప్రేమ చూపుతున్నాయని వారు విమర్శించారు కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంలో పాలకవర్గాలు. లేబర్  మరియు రెవెన్యూ  యంత్రాంగం  పూర్తిగా విఫలం చెందారని వారు విమర్శించారు వ్యవసాయంలో కూలీ రెట్ల  పెంపు కోసం కూలీలు కూలిపోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపు  నిచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానంలో ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12 వేలు ఇవ్వాలని ఇచ్చిన హామీని వెంటనే అమలు జరపాలని డిమాండ్ చేశారు  ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు సోమ పంగు జానయ్య   అధ్యక్షత వహించగా వ్యవసాయ కార్మిక సంఘం( బి కే యం యు ) జిల్లా అధ్యక్షులు  రెమిడీయాల  రాజు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జుట్టుకొండ బసవయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎం. ముత్యాలు తెలుగుదేశం రైతు విభాగం నాయకులు చాపల శ్రీను దళిత కవి బచ్చల కూర జార్జి బీసీ సంఘం నాయకులు బత్తుల  ఉపేందర్ 35వ వార్డు కౌన్సిలర్ మేదర లలిత. ప్రముఖ వైద్యులు డాక్టర్ సూర్య నారాయణ ఎల్ హెచ్ పి హెచ్ నాయకులు రాజు నాయక్. రవి నాయక్ డివైఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి  జిల్లపల్లి నరసింహారావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు అరె రామకృష్ణారెడ్డి వ్యవసాయ కార్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు  నారసాని వెంకటేశ్వర్లు ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు జంగపల్లి సాయి  కాంగ్రెస్ నాయకులు గంధం పాండు  పంది తిరపయ్య ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి సంపతి వెంకన్న నవతెలంగాణ బుక్ హౌస్ కోఆర్డినేటర్ రఘువరన్ పురుషోత్తం తదితరులు పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక  ఉద్యమానికి సంఘీభావం మద్దతు తెలియజేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333