అస్తమించిన విప్లవ సూర్యుడు . ప్రజాస్వామిక  విలువలకై

Aug 8, 2024 - 09:14
Aug 21, 2024 - 21:10
 0  6
అస్తమించిన విప్లవ సూర్యుడు . ప్రజాస్వామిక  విలువలకై

, సామాజిక మార్పుకై, అంతరాలు లేని వ్యవస్థ కోసం  పాదయాత్రలు చేసిన అలుపెరుగని బాటసారి .   ఎత్తు పల్లాలు ఉండవచ్చు కానీ  త్యాగం, కృషి  అపారమైనది .స్ఫూర్తిపొందడం మన బాధ్యత.
***(*******
-- వడ్డేపల్లి మల్లేశం
---6...08...2024(గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా వ్యాసం)-----------

      తెలంగాణ జాతిపితగా  సిద్ధాంతకర్తగా పేరుందిన  ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి  జయంతి రోజైనా  6 ఆగస్టు  2023 వ రోజున  ప్రజా యుద్ధనౌక , విప్లవ రచయిత , సామాజిక కార్యకర్త,  మెరుగైన సమాజం కోసం  నమ్మిన సిద్ధాంతం పునాదిగా  వ్యవస్థ ప్రక్షాళన కోసం  దశాబ్దాల పాటు  తన కృషిని కొనసాగించిన గద్దర్ అనారోగ్యంతో మృతిచెందడం  మార్పుకై తపనపడుతున్నవారికి, బరోసాకు ఎదురుచూస్తున్నవారికి తీరని నష్టగా భావించవచ్చు.    సాహిత్య సాంస్కృతిక రంగాలలో  వేలాది మందిని  కళాకారులను తయారు చేయడమే కాకుండా  సామాజిక వ్యవస్థ  ప్రక్షాళనలో  ప్రగతి కాముకుల మధ్యన  అంతరాలు లేని వ్యవస్థ కోసం పనిచేసిన  అనుభవం ఆ తర్వాత తెలంగాణ  ఉద్యమానికి రాష్ట్ర ఆవిర్భావానికి ఎంతగానో తోడ్పడినది  .గత కొంతకాలంగా  ఉద్యమ భావజాలానికి కొంత అటు ఇటుగా  పనిచేస్తున్న క్రమంలో  ఉద్యమ శక్తులు, ప్రగతికారులు  చివరికి సాంప్రదాయ పార్టీలు కూడా  కొంత విమర్శించిన సందర్భం లేకపోలేదు.  చివరి కంటా సిద్ధాంతానికి అనుగుణంగా  పనిచేయడం నిబద్ధతగా పోరాడడం  నిజంగా కష్టసాధ్యమైన పని . కానీ ఆ క్రమంలో విజయవంతమైన వాళ్ళు కూడా   లేకపోలేదు..
    జూలై 20వ తేదీ నాడు  గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ  ఆస్పత్రిలో చేరిన తర్వాత  3 ఆగస్టు 2023  రోజున శస్త్ర చికిత్స జరిగి విజయవ0 తమైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేసినప్పటికీ  రెండు రోజుల లోపలనే పరిస్థితులు విషమించి  6 ఆగస్టు 2023  ఆదివారం రోజున  మృత్యువు   కబళించడం బాధాకరమే . ఉద్యమ కాలంలో  ముఖ్యంగా తెలంగాణ  పోరాట సందర్భంలో ఇంటింటికి గడపగడపకు పాదయాత్ర నిర్వహించి  ప్రజలను చైతన్యవంతం చేసి తెలంగాణ భావజాలాన్ని విస్తృత పరచడంలో క్రియాశీలక పాత్ర పోషించిన విషయం ఎవరు కూడా కాదనలేరు.  తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటును పార్టీ వ్యతిరేకించినప్పుడు  గద్దర్  విభేదించినట్లు పత్రిక కథనాలు టీవీ మాధ్యమాల ద్వారా తెలుస్తున్నది.  అభిప్రాయాలు సందర్భాలు నిర్ణయాలు  వ్యక్తిత్వాన్ని  వ్యక్తిగత వాదాన్ని  నిర్ణయిస్తాయి అనడంలో సందేహం లేదు. కానీ  తెలంగాణ పోరాటంలో మాత్రం గజ్జ గట్టి  పాటలు రాసి పాడి  ఊరు ఊరు గడపగడప తిరిగి  మేధావుల ప్రసంగాలకు  పాటలను ఆశు కవితలను  జోడించి  ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలోనూ  తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన అనేక క్రియాశీలక సందర్భాలలో  చేసిన కృషిని ఎవరూ కాదనలేరు. 
    తొలినాళ్లలో :-
**(((((((((((౯
.. బ్యాంకు ఉద్యోగిగా కొంతకాలం పనిచేసినప్పటికీ  19 85 ప్రాంతంలో ఉద్యోగానికి రాజీనామా చేసి  ప్రజల సమస్యలను  ప్రధానంగా ఫోకస్ చేస్తూ  భూ సంస్కరణలు, వెట్టిచాకిరి, అంతరాలు అసమానతలు, దోపిడీ వ్యవస్థ, శ్రామిక వర్గ నియంతృత్వము,  భూస్వామి వ్యవస్థపై తిరుగుబాటు  వంటి అంశాలను ప్రధాన  ప్రచార అ స్త్రాలుగా భావించి బుర్రకథ,  ఒగ్గు కథ వంటి  ప్రధాన ప్రక్రియలను  తన ప్రచార క్షేత్రంలో  ఉద్యమ ప్రస్థానంలో
ఉపయోగించి  అలుపెరుగని పోరాటంలో  ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కృషి చేసినట్లుగా తెలుస్తున్నది  .  కారంచేడు సంఘటనపై  ప్రతిస్పందించి పోరాడినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తున్నది.  మెదక్ జిల్లా   తూఫ్రాన్ లో జన్మించిన  గద్దర్ అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు  లచ్చమ్మ శేషయ్యలకు  పేద దళిత కుటుంబంలో జన్మించినప్పటికీ  ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు హైదరాబాదులో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసి  కొంతకాలం బ్యాంకు ఉద్యోగం చేసినప్పటికీ  తృప్తి చెందక  స మ కాలిన సామాజిక రాజకీయ పరిస్థితులను  అవగాహన చేసుకుని పోరాట క్రమంలో  జననాట్యమండలి స్థాపనలో  వ్యవస్థాపకులలో క్రియాశీలక భూమిక పోషించినట్లు  ప్రసార మాధ్యమాల ద్వారా తెలుస్తున్నది  .
    ఒక వ్యక్తి గురించి.......  అసాధారణ ప్రతిభ  పాట వాళ్లను ప్రదర్శించినప్పటికి  సామాజిక స్ఫూర్తితో  అలుపెరుగని పోరాటం చేయడం అనేది నిబద్ధత, అంకితభావం, చిత్తశుద్ధి, సమాజం పట్ల  స్పష్టమైన అవగాహనబట్టి  నిర్ణయించబడుతుంది . ఆటుపోట్లు  లోపాలు వైఫల్యాలు  ఎన్ని ఉన్నప్పటికీ  దశాబ్దాల తరబడిగా వ్యవస్థను మార్చాలని తపనతో చేసిన కృషి  ఎదుర్కొన్న సమస్యలను  పరిశీలించినప్పుడు  వ్యక్తులుగా మనకు మనం కూడా ఏ మేరకు ఈ వ్యవస్థ కోసం పని చేసినామో ప్రశ్నించుకోవలసిన అవసరం ఉన్నది . ఇతరులను విమర్శించడం ఎంత ముఖ్యమో  మన వ్యక్తిగత సామూహిక జీవితము లోపల కూడా  ఏ మేరకు సామాజిక స్పృహ కలిగి ఉన్నాము?  మన లోపాలు ఏమిటి ? ఎందుకు ఈ బలహీనతలు?  సామాజిక బాధ్యతను నిర్వహించడానికి మనకు ఉన్నటువంటి ఆటంకాలు అధిగమించడానికి ఎందుకు కృషి చేయడం లేదో ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం మన అందరి పైన ఉన్నది  .వ్యక్తులు అశాశ్వతం కానీ వ్యవస్థ శాశ్వతం  వ్యవస్థ కోసం  ప్రక్షాళన చేసి  మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించడానికి తనదైన కోణంలో పనిచేసిన గద్దర్  కాల గమనంలో కలిసిపోయినారు.  కానీ  వ్యవస్థను కొనసాగించే క్రమంలో  ఉద్యమ శక్తులు తిరిగి ప్రారంభం కావాల్సిన అవసరం చాలా ఉన్నది . త్యాగాలు లేకుండా, ఆరాటం  పోరాటం అసలే కానరాకుండా,  మొక్కుబడి ప్రసంగాలు మాటలతో  జీవితంలో ఎలాంటి  చర్చ కూడా లేకుండా   కొనసాగించే జీవన గమనం  నిరుపయోగమైనది  .ఆ రకంగా అర్థం చేసుకున్నప్పుడు  చరిత్రలో గద్దర్ లాంటి  సామాజిక జీవులు, సంఘసంస్కర్తలు, ఉద్యమ శక్తులు,  పోరాట వీరులు , విప్లవ రచయితలు, కవులు కళాకారులు మేధావులు  నిలబెట్టిన స్థానాన్ని పదిల పరచి భవిష్యత్ తరాలకు ఈ వారసత్వాన్ని అందించడానికి మన వంతుగా కృషి చేయడానికి  అమరుల నుండి స్ఫూర్తిని పొందినప్పుడు మాత్రమే  మన జీవితాలకు అర్థం ఉంటుంది.  మౌనంగా,  నిరర్థకంగా,  నిస్క్రియాత్మకంగా,  నిర్జీవంగా,  బాధ్యతారాహిత్యంగా,  ఆలోచన లేకుండా,  ఆత్మ స్థైర్యం  కాన రాకుండా,  మొక్కుబడి జీవితం గడిపితే దానికి అర్థం లేదు.  ఆ బ్రతుకు శూన్యం అని తెలుసుకుంటే మంచిది.  ప్రజాస్వామ్యబద్ధంగా గాని  విప్లవ మార్గంలో కానీ  అంతిమంగా సాధించవలసినది సామాజిక మెరుగుదల,  ఉత్తమ  సంస్కారము,  మెరుగైన సమాజం .... ఆ వైపుగా మనము కృషి చేసి  గద్దర్ ఆశించినటువంటి లక్ష్యాలను  చేరుకునే క్రమంలో అమలు చేసినటువంటి సిద్ధాంత పోరాటాలను  స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత అభ్యుదయవాదులు ప్రగతి కాముకులు  సాహిత్య సాంస్కృతిక సామాజిక చారిత్రక రంగాలలో కృషి చేయడం ద్వారా  చైతన్య భావజాలాన్ని  మరింత చైతన్యం చేసే క్రమంలో  కొ న ఊపిరి వరకు కూడా పోరాటాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది . ఆటుపోట్లు లోపాలను మాత్రమే కారణాలుగా చూపెట్టి  విమర్శించడానికి మాత్రమే పూనుకొని  ఆచరణలో త్యాగాలకు సిద్ధపడకుండా  నిర్జీవంగా బ్రతికే బదులు  ఉత్తమ ఆలోచనతో శక్తి మేరకు ప్రయత్నం చేయడమే మన ముందున్న కర్తవ్యం గా భావించి  మన నుండి దూరమైన గద్దర్ గారి జీవితంలోని ప్రధాన ఘట్టాలను  పోరాటపటిమను చిత్తశుద్ధిని త్యాగనిరతిని  పుణి కి పుచ్చుకుందాం . నూతన వ్యవస్థ ఆవిర్భావం కోసం మన వంతు  శక్తిని ధార పోద్దాం.  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కూడా  గద్దర్ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తీర్మానం చేయడం  ఏకాభిప్రాయం కలిగినటువంటి  రాజకీయ నాయకులు  పార్థివ దేహంతో  చేరిపోవడం  సభలు సమావేశాలను నిర్వహించడం ద్వారా  అభ్యుదయవాదులు  ఆయనతో సజీవ సంబంధాలు ఉన్నవాళ్లు నిర్వహించ తలపెట్టినటువంటి సమావేశాలు సభలను విజయవంతం చేయడం ద్వారా  మన కర్తవ్యాలను నెమరు వేసుకుందాం.  మెరుగైన సమాజానికి ప్రశ్న ,ఆరాటం, పోరాటం  ప్రధాన ఘట్టాలుగా  చారిత్రక సత్యాలుగా  అనివార్యమని  భవిష్యత్తు తరాలకు తెలియజేద్దాం.  అదే మనం మ న నుండి దూరమైన గద్దర్ కు అర్పించగలిగిన   ఘన నివాళి కాగలదు.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సేన ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటుపల్లి  జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333