ఎస్ ఎస్ సి 2009_2010 బ్యాచ్ మిత్రుని కుటుంబానికి 30వేలు ఆర్థిక సాయం

అడ్డగూడూరు 09 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో ఇటీవలే అనారోగ్య సమస్యతో అకాల మరణం సంభవించిన చిరకాల స్నేహితుడు దౌపాటి మహేష్ కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చి స్నేహం అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. అడ్డగూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2009-10, పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి రూ.30 వేల నగదును సేకరించి అందుబాటులో ఉన్న స్నేహితులు బుధవారం మృతుడి తల్లికి అందజేశారు.ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ..ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు దౌపాటి మహేష్ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి మల్లేష్, పయ్యావుల రమేష్, గూడెపు నరేష్, తాడోజు లక్ష్మణా చారి,కత్తుల నరేష్,చుక్క లోకేష్,తోట నగేష్, బాలెంల శంకర్, కప్పల,మహేష్ తదితరులు ఉన్నారు.