చిన్ననమేల గ్రామంలో కాటమయ్య పండుగాకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మందుల సామేల్ 

Dec 26, 2024 - 21:57
Dec 26, 2024 - 22:01
 0  26
చిన్ననమేల గ్రామంలో కాటమయ్య పండుగాకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మందుల సామేల్ 

మద్దిరాల 26 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలో చిన్ననేమ్మిల గ్రామంలో గౌడ కులస్తులు కాటమయ్య పండుగ చేసిన సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తుంగతుర్తి శాసనసభ్యులు  మందుల సామేలు ఈ కార్యక్రమంలో గౌడ కులస్తుల పాల్గొన్నారు. ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ..ఇలాంటి పండుగలు నా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన జరుపుకోవాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అన్ని గ్రామాలలో నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. దేవుడు ఒక్కడే కానీ వేరు వేరు నామకరణాలతో పిలవబడే దేవతా మూర్తులకు నా వంతు సహాయ సహకారం ఎల్లవేళలా ఉంటుందని కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.