గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
కోదాడ 08 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సోమవారం రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న ధర్నా లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల ముందు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇస్తామని అర్హులైన కారోబార్లని బిల్ కలెక్టర్ గా నియమిస్తామని అర్హులైన వారిని సహాయ కార్యదర్శిగా నియమిస్తామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని 10 నెలలు అవుతున్న కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం దుర్మార్గమని అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచయతీ సిబ్బంది లింగయ్య, బాబు ,కుమారి, నరేష్, వెంకన్న, ఉష, నాగమ్మ, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.