వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లైములు వెంటనే పరిష్కరించాలి...
మునగాల 10 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు గంట వెంకటేశ్వర్లు, కోల ఆంజనేయులు మాట్లాడుతూ 2026 సంవత్సరంలో జిల్లాలోని నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్మిక వ్యతిరేక విధానాల కారణంగా జిల్లాలో అనేక పెండింగ్ క్లైములు సమస్యల పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ క్లైములకు నిధులు విడుదల చేసి, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి అల్లి నాగరాజు, చిలువేరు రాంబాబు, అనపర్తి రాంబాబు, బాల ఉపేందర్, మునుకుంట నాగయ్య, కోట సైదిరెడ్డి, కోల చందర్రావుతో పాటు మహిళా కార్మికులు కోల స్రవంతి, బెల్లి మణమ్మ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.