పువ్వులు అందించి.. జాగ్రత్తలు సూచించిన సూర్యాపేట పోలీస్
తెలంగాణ వార్త సూర్యపేట 10-01-26 :
సంక్రాంతి పండుగకు ఆంధ్ర వెళ్తున్న వాహనదారులకు పువ్వులు ఇచ్చి జాగ్రత్తలు తెలిపిన ఎస్పీ..
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్న ప్రజలు సురక్షితంగా గమ్యం చేరి సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుని మళ్ళీ తిరిగి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతూ సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ తరపున పువ్వులు అందించి శుభాకాంక్షలు, జాగ్రత్తలు తెలిపిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు.
సూర్యాపేట పట్టణం జాతీయ రహదారి 65 పై ఎఫ్ సి ఐ గోడం వద్ద సంక్రాంతి పండుగకు వెళ్తున్న వాహనాల రద్దీనీ పరిశీలించి సురక్షిత ప్రయాణాలు చేయాలని సూచించడం జరిగింది.