విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పై నుండి దూకిన యువకుడు పోలీసులను పరుగు పెట్టించిన
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి:- విజయవాడ ప్రకాశం బారేజ్ పై నుండి దూకిన యువకుడు.పోలీసులను పరుగులు పెట్టించాడు.బ్యారేజ్ 26వ ఖానా వద్ద బారేజ్ గోడ పై నుంచి దూకిన యువకుడు ఆత్మ హత్యకు పడ్డాడని బారేజ్ పై వెళుతున్న వాహన చోదకులు తాడేపల్లి పోలీసుల కు సమాచారం అందించారు హుటా హుటిన బారేజ్ పైకి వచ్చిన ఏఎస్ఐ శాంతకుమార్ మరియు సిబ్బంది అచర్యపోయారు.. వాడెవడో ప్రొఫెషనల్ గజ ఈత గాడులా ఉన్నాడు అని దాదాపు 50 అడుగులు పై నుండి దూకి నదిలో ఈత కొడుతు కనిపించడంతో అచర్య పోయారు.పోలీసులు అతనిని పైకి రావలసింది గా కేకలు వేయడంతో కంగారు పడి ఈదుకుంటూ గేట్ వద్దకు వెళ్లి దాక్కున్నాడు.అతను పోలీసుల ను చూసి భయపడు తున్నాడని గమనించి చేసేదేమి లేక ఏ ఎస్ ఐ శాంత కుమార్ అక్కడ నుండి వెళ్ళిపోయారు..