విద్యానగర్లో గర్జించిన మహిళా లోకం:
మహిళల పై జరుగుతున్న దాడుల ను అరి కట్టాలి
200 మంది మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీతో వెళ్లి
రామలింగేశ్వర టాకీసు వద్ద మానవహరం ఏర్పాటు చేశారు.
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని,
మహిళలకు రక్షణ కల్పించాలి,
కఠినమైన చట్టాలను అమలు చేయాలని కోరుతూ
45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.
ప్రముఖ వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ఇరిగి కోటేశ్వరి, లయన్స్ స్ఫూర్తి క్లబ్ మాజి చైర్మన్ మద్ది హైమావతి, అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు మాతృమూర్తి బిక్కుమళ్ల మంజుల, మొదలగు మహిళా ప్రముఖులు ఈ ర్యాలీ ని ముందుండి నడిపించారు.
దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారలను అరికట్టాలని, మహిళలపై అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సూర్యాపేట పట్టణంలోని 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ మరియు లయన్స్ స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది మహిళలు నినాదాలు చేస్తూ, ర్యాలిగా వెళ్లి రామలింగేశ్వర టాకీసు వద్ద మానవ హారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ మాట్లాడుతూ దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. నేడు ఆడపిల్లలను ఉన్నత విద్య కోసం, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు పంపాలంటె భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మహిళలపై అత్యాచారాలు చేసే వారిని దుబాయ్ లో మాదిరిగా ప్రజల మద్యలో తల నరికివేయాలని అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసను అరికట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ ఇరిగి కోటేశ్వరి మాట్లాడుతూ దిశ, నిర్భయ ఇలా మహిళల పై నిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. కూలిపనికి వెళ్లే మహిళ, చదువుకునే విద్యార్థిని, ఉద్యోగం చేసే మహిళ ఇలా ప్రతి ఒక్కరిపై ఏదో ఒక ప్రదేశంలో, ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి అరాచకాలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకుని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మీ మాట్లాడుతూ కలకత్తాలో ఆసుపత్రిలో విధినిర్వహణలో వున్న మహిళా డాక్టర్ పై అతి కిరాతకంగా దాడిచేసి చంపడం చూస్తుంటె దేశంలో మహిళల రక్షణపై మరొకసారి సమాజం భయపడే రోజులు వచ్చాయని అన్నారు. సేవచేసే వైద్యులకు రక్షణ కల్పించాలని, భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకుని రావాలని అన్నారు.
కార్యక్రమంలో లయన్స్ స్ఫూర్తి క్లబ్ మాజి ప్రెసిడెంట్ మద్ది హైమవతి మాట్లాడుతూ చిన్నపిల్లల నుండి వ్ర్రద్దుల వరకు వయసుతో సంబంధం లేకుండా మహిళలపై నిత్యం అకృత్యాలు జరుగుతున్నాయని, అందులో చాలా సంఘటనలు వెలుగులోకి రావడం లేదని అన్నారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఎలా రక్షణ కల్పించాలని తల్లిదండ్రులు భయపడే రోజులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సంతోష్ బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలని, మహిళలను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఉప్పల మంజుల, మిర్యాల కవిత, రుచిత, మౌనిక, రేణుక, నల్లపాటి సునిత, అనంతుల ఇందిర, మిట్టపల్లి శైలజ, ఆర్ పి విజయ, అంగన్ వాడీ మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు