భద్రాచలం త్రివేణి పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
భద్రాచలం త్రివేణి పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో వివిధ రకాల యోగాసనాలను వేపించి వారికి అవగాహన కల్పించడం జరిగినది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జంగాల మంజుల మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులకు పాఠశాల వయసులో ఉన్నప్పుడు యోగ ఆసనాలు వాళ్ళ యొక్క చదువులో ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయని తెలియజేశారు. అదేవిధంగా పాఠశాల వయసులో విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే ప్రతి ఒక్క విద్యార్థి ఉదయం పూట క్రమం తప్పకుండా యోగాసనాలు ,అభ్యసన చేయాలని విద్యార్థిని విద్యార్థులకు దిశా నిర్దేశం చేయడం జరిగినది. ఈ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులతో వివిధ రకాల ఆసనాలను వేయించి వారికి ఒక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏ,వో బాబురావు, వైస్ ప్రిన్సిపాల్ విమలాదేవి, అకడమిక్ ఇన్చార్జి నరేష్, క్యాంపస్ ఇంచార్జ్ సందీప్ రెడ్డి,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు పాల్గొని విజయవంతం చేశారు.