చెలరేగిన మంటలు ..మాటలర్పిన ఫైర్ సిబ్బంది

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి:- అంటుకున్న అగ్గి తాటి చెట్లు పైపులు గడ్డి దగ్దం.. మంటలార్పిన ఫైర్ సిబ్బంది.. ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని గట్టికల్లు గ్రామ శివారులో గుండు వారి బావి సమీపంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు వరి పొలం కొయ్య కాళ్ళు తగలబెట్టేందుకు నిప్పు వేయగా మంటలు చలరేగి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మండలంలో ఎండ తీవ్రత పెరిగి తాటి చెట్లు వ్యవసాయ బావుల పైపులైన్లు వరిగడ్డి పూర్తిగా దగ్ధం అయ్యాయి . ప్రమాద తీవ్రత పెరగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడతో అక్కడికి చేరుకున్నఫైర్ సిబ్బంది మంటలను అర్పారు. సుమారు 20 ఎకరాల వరకు గడ్డి కోయకాల్ల తో పాటు గడ్డి దగ్ధమయ్యాయి.