వికలాంగులకు స్థానిక సంస్థలలో నామినేటెడ్ పోస్ట్లు అమలు చేయాలి

స్థానిక సంస్థ ఎన్నికలలో వికలాంగులకు హక్కు కల్పించాలి! వనం ఉపేందర్
భువనగిరి 9 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– భువనగిరి మండల కేసారం గ్రామంలో ఎన్.పి. ఆర్.డి గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు.ఎన్ పి ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం 2011నుండి ఇప్పటివరకు 3వందల రూపాయలు పెన్షన్ మాత్రమే ఇస్తున్నది ఇది వికలాంగులపై చిన్న చూస్తూ ఇది దుర్మార్గమైన చర్య కానీ బిజెపి ప్రభుత్వం ధరలు 3వందల రెట్లు ధరలు పెంచి వికలాంగులపై భారాలు పెంచి ఇబ్బందులకు గురై చేస్తున్నది అందుకని వికలాంగులకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ముందు హామీ ఇచ్చి సుమారు రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ 6వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదు ఇప్పటికైనా పెన్షన్ వెంటనే ఇవ్వాలని వికలాంగులకు 300 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని వికలాంగులకు ఉపాధి అవకాశాల కొరకు బ్యాంకు ద్వారా ఎలాంటి చర్తులు లేకుండా 100% సబ్సిడీతో పది లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డు 35 కిలోల బియ్యం ఇవ్వాలని వికలాంగులకు ఉపాధి హామీ పని పథకంలో 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని వికలాంగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మానసిక వికలాంగులకు భువనగిరి మండలంలో మానసిక వికలాంగులకు గవర్నమెంట్ ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా కోశాధికారి కొత్త లలిత ఎన్ పి ఆర్ డి కేసరం గ్రామం అధ్యక్షురాలు సురువు సరిత కార్యదర్శి రచ్చ అశోకు ఉపాధ్యక్షురాలు పోతుల బాలమని సహాయక కార్యదర్శి రాగాల ఉప్పలయ్య మరొక సహాయ కార్యదర్శిరాళ్లు మెండి గుజ్జల సుధా, ఓం దాస్ కౌసల్య, ఎలకంటి పోచమ్మ, గౌరారం యాదమ్మ పిల్ల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.