మాసూం బాబా సాక్షిగా త్వరలోనే శ్రీశైలం నిర్వహితుల సమస్యలకు పరిష్కారం మార్కెట్ చైర్మన్ రామచంద్ర రెడ్డి హామీ

Oct 9, 2025 - 19:51
 0  101
మాసూం బాబా సాక్షిగా త్వరలోనే శ్రీశైలం నిర్వహితుల సమస్యలకు పరిష్కారం మార్కెట్ చైర్మన్ రామచంద్ర రెడ్డి హామీ

09-10-2025 తెలంగాణ వార్తా ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండలం జటప్రోలు గ్రామంలో  శ్రీశైలం నిర్వాసితుల సమస్యలు మాసూం బాబా సాక్షిగా త్వరలోనే పరిష్కారం. కొల్లాపూర్ మాజీ మార్కెట్ చైర్మన్ రామచంద్ర రెడ్డి, హామీ.

 చిన్నంబావి మండలం జట్రపోల్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన మాసూం  బాబా దర్గా ప్రాంగణంలో గురువారం శ్రీశైలం నిర్వాసితులు  భారీ సంఖ్యలో మాసూం బాబా దర్గా దగ్గరికి చేరుకుని   ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 67 గ్రామాల నిర్వాసితులు పాల్గొని, మాసూమ్  బాబాకు మొక్కులు చెల్లించి బాబా దీవెనలు పొందారు. సుమారు 400 నుండి 500 మంది పైననే నిర్వాసితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వాసితుల ఆహ్వానం మేరకు కొల్లాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామచంద్ర రెడ్డిఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీశైలం నిర్వహితుల తరఫున పాల్గొన్నారు. నిర్వాసితులు రామచందర్ రెడ్డిని  శాలువాతో సన్మానించి, పూల బోకేతో అభినందించారు. ఆ తర్వాత రామచంద్ర రెడ్డి మాసూం బాబా దర్గా దగ్గరికి మాలిజ తీసుకుని  వెళ్లి  శ్రీశైలం నిర్వహితుల తరఫున ప్రత్యేక ప్రార్థనలు చేయటం జరిగింది. రామచంద్ర రెడ్డి   మాట్లాడుతూ, “35 సంవత్సరాలుగా పోరాడుతున్న శ్రీశైలం నిర్వాసితుల సమస్యలు త్వరలోనే పరిష్కారం  అవుతాయన్నారు. నిర్వాసితుల ఆహ్వానం మేరకు జట్రపోల్ గ్రామంలోని మాసుo బాబా దర్గా వద్ద మొక్కులు చెల్లించుకోవడం అత్యంత శుభదాయకమైన కార్యక్రమం. బాబా దీవెనలతో నిర్వాసితుల సంకల్పం నెరవేరుతుందని “గత రెండు నెలల క్రితం జట్రపోల్ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీశైలం నిర్వాసితుల సమస్యపై స్పష్టంగా స్పందించారు. వారి ఆదేశాల మేరకు గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు నిర్వాసితుల జాబితాలను పరిశీలించారు.ప్రభుత్వం రూపొందించిన లిస్టులోని 2000 మంది నిర్వాసితులలో ఎవరెవరు మరణించారు, వయోపరిమితి  కారణంగా అర్హులు కాదో తెలుసుకునే పనిలో ఉన్నారు. రిటైర్మెంట్ వయసుకు చేరువలో ఉన్న వారికి ప్యాకేజీలు ఇవ్వడం, యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి” అని వివరించారు.రామచంద్ర రెడ్డి మరింతగా మాట్లాడుతూ, “ప్రభుత్వం నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఈ మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కొంత ఆలస్యం కావచ్చు, కానీ మంత్రివర్యులు కూడా ఉద్యోగాల విషయమై ప్రత్యేకంగా దృష్టి పెట్టానని నాకు తెలిపారు. మేము అబద్ధాలు చెప్పడం లేదు — ప్రభుత్వం నిజాయితీతో సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తోంది” అని అన్నారు.“2000 మందికి సంబంధించిన జాబితా త్వరలో సిద్ధం కానుంది. ఎంతమంది మరణించారో, ఎంతమంది వయస్సు కారణంగా అర్హులు కాదో తేలిన తర్వాత, ఉద్యోగాలు ఇవ్వగలిగే వారిని గుర్తించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు చెప్పారని” రామచంద్ర రెడ్డి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ, డాగుజీ రావు గోవిందు పెబ్బేటి నారాయణరెడ్డి “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో ఇచ్చిన హామీకి రెండు నెలలు గడిచినా ఇంకా చర్యలు కనిపించడం లేదు. ఇప్పటికైనా మంత్రులు ఉద్యోగాల విషయంలో శ్రద్ధ చూపి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని మేము కోరుతున్నాం” అని విజ్ఞప్తి చేశారు.జట్రపోల్ మాసం  బాబా దర్గా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో భక్తిశ్రద్ధలతో, సామరస్య వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. నిర్వాసితులు బాబా దీవెనలు తీసుకొని తమ సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నిర్వాసితులు పెబ్బేటి నారాయణరెడ్డి, కె. డాగోజి రావు, విష్ణు సాగర్, మేకల బాలస్వామి, తూముకుంట శాంతయ్య, ఏ స్. శ్రీనివాసులు, ఎం.డి. షబ్బీర్ అలీ, గోవిందు, మంచాలకట్ట బాలయ్య, ఉత్తరాయ గౌడ్, శ్రీనివాసులు, వెంకటంపల్లి నరసింహ, బెక్కెం కాంతయ్య, రాఘవేంద్ర శెట్టి, కురుమయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నిర్వాసితులు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చి ఉద్యోగాల రూపంలో న్యాయం సాధించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని సంకల్పించారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State