పార్కింగ్ స్థలం కు అడ్డంగా శ్రీ లక్ష్మి బిగ్ మార్ట్ బోర్డు 

Feb 28, 2026 - 19:44
 0  1
పార్కింగ్ స్థలం కు అడ్డంగా శ్రీ లక్ష్మి బిగ్ మార్ట్ బోర్డు 
పార్కింగ్ స్థలం కు అడ్డంగా శ్రీ లక్ష్మి బిగ్ మార్ట్ బోర్డు 

ప్రమాదాలకు నిలయంగా మారిన సూపర్ మార్కెట్ బోర్డు 

పార్కింగ్ కు అడ్డంగా ఉన్న  బోర్డును  తొలగించాలి

జోగులాంబ గద్వాల 28 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. పాత బస్టాండు లో శ్రీలక్ష్మి బిగ్ సూపర్ మార్కెట్ ముందు పార్కింగ్ కు అడ్డంగా వాహనాలకు అడ్డంగా శ్రీలక్ష్మి బిగ్ సూపర్ మార్కెట్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది.  అయితే ఈ బోర్డు వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనాలు ఆపే చోట  పార్కింగ్ కు అడ్డంగా ఉండడం, రోడ్డు పక్కల నుంచి వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉన్న స్థలంలో బోర్డును ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ 10 గ్రామాల ప్రజలు ప్రయాణికులు వెయిట్ చేసే స్థలంలో రోడ్డు కు బోర్డు పాతడం చాలా విడ్డూరం. మున్సిపాలిటీ కమిషనర్ మరియు మునిసిపాలిటీ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి గారు అలాగే ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు స్పందించి ప్రమాదాలకు చోటు చేసుకోకుండగా అధికారులు గమనించి అట్టి బోర్డును వేరే చోట ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333